వృద్ధులు, వికలాంగుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత

ABN , First Publish Date - 2022-08-13T05:27:14+05:30 IST

వృద్ధులు, వికలాంగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్‌ జాతీయ సమైక్యతను చాటేలా నిర్వహించు కోవడం అభనందనీయమని అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అన్నారు

వృద్ధులు, వికలాంగుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత
వృద్ధాశ్రమంలో వృద్ధులకు రాఖీలు కడుతున్న అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌


- ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

- ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

- అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌


కరీంనగర్‌ కల్చరల్‌, ఆగష్టు 12: వృద్ధులు, వికలాంగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్‌ జాతీయ సమైక్యతను చాటేలా నిర్వహించు కోవడం అభనందనీయమని అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అన్నారు. శుక్రవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం, బస్టాండ్‌, జిల్లా కారాగారంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొని అందరికీ రాఖీలు కట్టి పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున రక్షాబంధన్‌ వేడుక నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కారాగారంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ విడుదలైన ఖైదీలు సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు. బస్టాండ్‌ వద్ద మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వృద్ధాశ్రమంలో మాట్లాడుతూ వృద్ధుల సమక్షంలో వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వి పద్మావతి, డీఆర్డీఏ పీడి శ్రీలత, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జువైరియా, జైలు సూపరింటెండెంట్‌ సమ్మయ్య, సీడీపీఓలు సబితాకుమారి, కస్తూరి, ఉమారాణి, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:27:14+05:30 IST