నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-04-13T04:20:38+05:30 IST

నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ హరి చందన అదికారులను ఆదేశించారు.

నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 12: నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ హరి చందన అదికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమంలో 1- 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని సూచించారు. ఆశా, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి మాత్రలు వేయించాలని సూచించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో జయచంద్ర మోహన్‌, సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌, డీడబ్ల్యూవో జయ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T04:20:38+05:30 IST