రాజీ మార్గమే రాజ మార్గం

ABN , First Publish Date - 2022-08-14T05:11:59+05:30 IST

రాజీ మార్గమే రాజమార్గమని జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి సూచించారు.

రాజీ మార్గమే రాజ మార్గం
పోరుమామిళ్ల జాతీయలోక్‌ అదాలత్‌లో మాట్లాడుతున్న అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌.సరస్వతి

 జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 13: రాజీ మార్గమే రాజమార్గమని జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి సూచించారు. శనివారం జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని జడ్జి నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా  కేసుల రాజీకి వచ్చిన కక్షిదారులతో ఆయన సమావేశమై అవగాహన కల్పించారు. ఎలాంటి కేసులు అయినా రాజీ పడితే ఇరువురికి రాజమార్గమేనన్నారు. అనంతరం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవగుడి నారాయణరెడ్డి, సెక్రటరీ మురళీధర్‌రెడ్డి, న్యాయవాదులు, పోలీసు అధికారులు డీఎస్పీ నాగరాజు, సీఐ కొండారెడ్డి, సబ్‌డివిజన్‌ పరిధిలోని యూనిట్‌ అధికారులంతా పాల్గొన్నారు. జడ్జి బాబాఫకృద్దీన్‌ మాట్లాడుతూ శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 908 అన్ని రకాల కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. వాటి ద్వారా రూ.62,40,845 రాబడి వచ్చిందన్నారు. న్యాయవాదులకు, పోలీసులకు జడ్జి ప్రశంసా పత్రాలు అందజేశారు.  

బద్వేలు రూరల్‌..:  స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 239 కేసులకు పరిష్కారం జరిగినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. జాతీయ లోక్‌అదాలత్‌లో నాలుగు బెంచిలు ఏర్పాటు చేశారు. మొదటి బెంచి అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సరస్వతి, రెండో బెంచి ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.కాశీవిశ్వనాథాచారి, మూడో బెంచి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.గాయత్రి, నాలుగో బెంచి జుడీషల్‌ మెజిస్ర్టేట్‌ ఆఫ్‌ సెకండ్‌క్లా్‌సలతో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌అదాలత్‌లో 239 కేసులు పరిష్కారం జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు ప్రశాంత జీవనం కొనసాగించాలని వారు  కోరారు. జాతీయ లోక్‌అదాలత్‌లో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:11:59+05:30 IST