Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 26 Jun 2022 19:24:55 IST

ప్రేయసిని కొండపై నుంచి తోసేసిన ప్రియుడు.. కింద పడుతూ గాలిలోనే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon
ప్రేయసిని కొండపై నుంచి తోసేసిన ప్రియుడు.. కింద పడుతూ గాలిలోనే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రేయసిని ప్రియుడు, ప్రియుడిని ప్రేయసి.. ఇలా ఒకరినొకరు ఆట పట్టిస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు అవి వికటించి.. అసలుకే మోసం వచ్చే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ప్రేమికుల మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. ప్రేయసిని కొండపైకి తీసుకెళ్లిన ప్రియుడు.. అమాంతం కిందకు తోసేశాడు. కింద పడే క్రమంలో ప్రియుడికి ఆమె బ్రేకప్ చెప్పింది. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట వందల అడుగుల ఎత్తున్న కొండపైకి వెళ్తారు. అక్కడి నుంచి బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకుంటారు. యువకుడు మాత్రం తన బంగీ జంప్ పూర్తి చేస్తాడు. అయితే యువతి ముందు ఒప్పుకొన్నా.. తీరా దూకే ముందు తెగ భయపడిపోతుంది. దూకాలా.. వద్దా.. అనే సందేహంలో కొండ చివరన అలాగే నిలబడి ఉంటుంది. ప్రియుడు ఎంత ధైర్యం చెప్పినా.. దూకేందుకు మాత్రం సాహసించదు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.. ఏమీ కాదు.. అని ప్రియుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం సాహసం చేయదు.

ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్ మిసైల్.. అయినా చలించకుండా.. గడ్డం గీసుకుంటున్న వ్యక్తి..

దీంతో చివరకు అతడికి విసుగొచ్చి, ప్రియురాలిని అమాంతం పైనుంచి తోసేస్తాడు. దీంతో ఒక్కసారిగా ఆమె లోయలో పడిపోతుంది. గాలిలో ఉండగానే కోపంతో 'నేను నీతో విడిపోతున్నాను' అంటూ ప్రియుడికి బ్రేకప్ చెబుతుంది. అయితే బంగీ జంప్ పూర్తవగానే ప్రియుడిని కౌగిలించుకుని సారీ చెబుతుంది. బంగీ జంప్ అనగానే మొదట భయపడ్డానని, కానీ ఆ అనుభూతి ఎంతో బాగుందని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

భర్త ఎదుటే భార్యపై చేయి వేసిన యువకుడు.. నా భార్యపై నీ పెత్తనం ఏంటీ.. అని భర్త ప్రశ్నించడంతో.. చివరకు..ఇవి కూడా చదవండిLatest News in Telugu

చోరీకి వెళ్లిన ఇంట్లోనే మందేసిన దొంగలు.. ఖరీదైన మద్యం బాటిళ్లు ఖాళీ చేసేశారు.. రూ.22 లక్షల విలువైన.. చెరువులో ఈత కొడుతున్న కుర్రాళ్ల కాళ్లకు తగిలిందో మూట.. అనుమానంతో అందరూ కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి చూస్తే..నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా అనగానే ఫ్రెండ్‌కు తాళం ఇచ్చాడో వ్యక్తి.. రాత్రి వెళ్లి చూస్తే తెరచి ఉన్న తలుపులు.. లోపలకు వెళ్తే..అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా.. అంటూ తమ్ముడి నుంచి ఫోన్.. డబ్బుల్లేక మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి చూస్తే..విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!Viral Video: పిల్లలను రోడ్డు దాటించడంలో.. ఈ గొరిల్లా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో.. చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.