Viral Video: ఖడ్గమృగాన్నే ముద్దు పెట్టుకున్న యువతి.. వామ్మో! ఈ యువతికి ఎంత ధైర్యమో..

ABN , First Publish Date - 2022-02-05T00:18:17+05:30 IST

ఖడ్గమృగం జోలికి వెళ్లేందుకు క్రూర మృగాలు కూడా సగం జంకుతాయి. మూతి మీదున్న పొడవాటి కొమ్మును చూస్తే జంతువులతో పాటూ మనుషులు కూడా హడలెత్తిపోతారు. అంత శక్తివంతమైన ఖడ్గమృగాలతో ఓ యువతి...

Viral Video: ఖడ్గమృగాన్నే ముద్దు పెట్టుకున్న యువతి.. వామ్మో! ఈ యువతికి ఎంత ధైర్యమో..

ఖడ్గమృగాలతో యువతి స్నేహం.. వినడానికే వింతగా ఉంది కదా. వేరే జంతువుల సంగతి ఏమోగానీ.. ఖడ్గమృగాలను చూస్తేనే గుండె గుభేల్.. అంటుంది. అలాంటిది ఓ యువతి వాటితో స్నేహం చేయడమే కాకుండా, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని.. ముద్దులు కూడా పెడుతోంది. కుక్క పిల్లల తరహాలో అవికూడా ఆమె పట్ల ప్రేమగా ఉండడాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఖడ్గమృగం జోలికి వెళ్లేందుకు క్రూర మృగాలు కూడా సగం జంకుతాయి. మూతి మీదున్న పొడవాటి కొమ్మును చూస్తే జంతువులతో పాటూ మనుషులు కూడా హడలెత్తిపోతారు. అంత శక్తివంతమైన ఖడ్గమృగాలతో ఓ యువతి స్నేహం చేస్తోంది. కూర్చుని ఉన్న యువతి ఒడిలో.. ఓ ఖడ్గమృగం తల పెట్టి సేదతీరుతూ ఉంటుంది. దాని తల మీద చేయితో నిమురుతున్న యువతి.. ఆత్మీయంగా ముద్దాడడాన్ని వీడియోలో చూడొచ్చు. పక్కనే మరో రెండు ఖడ్గమృగాలు ఆమె చుట్టూ చేరి ప్రేమగా ఉండడం.. చూడటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ వీడియోను రినోహూస్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. వీడియో చూసిన వారిలో కొందరు.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరి కొందరు సలహాలు ఇస్తున్నారు.

 రేస్ బైక్‌లో రయ్‌..మంటూ వచ్చాడు.. చివరకు పరువు పోగొట్టుకున్నాడు..



Updated Date - 2022-02-05T00:18:17+05:30 IST