Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 22 Feb 2022 17:54:48 IST

Viral Video: కోబ్రాను పట్టుకునేందుకు ఈ యువతి పెద్ద సాహసమే చేసింది.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: కోబ్రాను పట్టుకునేందుకు ఈ యువతి పెద్ద సాహసమే చేసింది.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

పాములను పట్టుకోవడమనేది ప్రాణాలతో చెలగాటం వంటింది. స్నేక్ క్యాచింగ్ సమయంలో కొందరు ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలు కూడా చూశాం. అలాంటి కష్టమైన పనిని ఓ యువతి ఎంతో ఇష్టంతో చేస్తోంది. చేయడమే కాకుండా అత్యంత విషపూరితమైన పాములను కూడా ఎంతో చాకచక్యంగా పట్టుకుంటోంది. ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి కోబ్రాను పట్టుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ఎక్కువగా మగవారే పాములు పట్టుకోవడాన్ని చూస్తూ ఉంటాం.. అయితే ప్రస్తుత వీడియోలో యువతి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

రోహిణి అనే యువతి కేర‌ళ‌కు చెందిన అట‌వీశాఖ‌లో ఉద్యోగిణి. ఈమెకు మొదటి నుంచి పాములు పట్టుకోవడం అంటే ఇష్టం. దీంతో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఆమె.. ఎక్కడ పాములు కనిపించినా వెంటనే ప్రత్యక్షమవుతుంది. ఎలాంటి పాములనైనా ఎంతో చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో వదిలిపెడుతుంటుంది. ఇటీవల కేరళ తిరువనంతపురంలోని కట్టక్కడలోని ఒక ఇంటి ఆవరణలో కోబ్రా కలకలం సృష్టించింది. దీంతో భయపడ్డ స్థానికులు.. రోహిణికి సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన ఆమె.. ఏమాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా దాన్ని పట్టుకుంది. పామును సునాయాసంగా ఓ సంచిలోకి పంపించి తర్వాత అడవిలో వదిలిపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుధా రామెన్.. తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ యువతి సాహసానికి సెల్యూట్ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.

వద్దంటున్నా భర్త బలవంతం.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ పైశాచిక ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: అరె! ఇదేంటీ అంత వరకు బాగున్న ఇతడి జుట్టు.. అలా మాయమైంది.. నవ్వులు పూయిస్తున్న వీడియో..videoబంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన భార్య.. తాళం తీసి గదిలోకి వెళ్లగానే బెడ్రూంలో అర్ధనగ్నంగా ఓ యువతి శవం.. ట్విస్ట్ ఏంటంటే..అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు.. పొద్దున్నే భార్యను పిలిస్తే గదిలోంచి నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే..అప్పులు తీర్చేందుకు భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి రూ.7లక్షలకు డీల్.. చివరకు సీన్ రివర్స్..!మెట్లు ఎక్కితే పడిపోతావ్, వద్దు అంటాడు తాత, నేనెక్కడికి వెళ్తున్నాను... అంటూనే 5 మెట్లు ఎక్కేసిందా సిసింద్రీ.videoఇంట్లోకి దూరి మరీ ప్రేయసి ముక్కు, జుట్టు కత్తిరించిన ప్రియుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.