రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-26T04:40:04+05:30 IST

పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆత్మా పీడీ విజయలక్ష్మి సూచించారు.

రసాయనిక ఎరువుల వాడకం  తగ్గించాలి
వరి పంటను పరిశీలిస్తున్న ఆత్మా పీడీ

ప్రొద్దుటూరు రూరల్‌, అక్టోబరు 25: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆత్మా పీడీ విజయలక్ష్మి సూచించారు. మండలంలోని తాళ్లమాపురం గ్రామ పొలాల్లో సాగు చేసిన వరి, మినుము, జొన్న పంటలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వరి పంటను సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామంలో కొంతమంది రైతులు రసాయన రహితంగా పంటలు సాగు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.  పంట సాగు చేసిన ఏడు నుంచి పది రోజులలోపు మొవ్వఈగ ఆశించి పంటను అధికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఈ నష్టాన్ని నివారించేందుకు ఎకరాకు 8 కేజీల చొప్పున బోరెడ్‌ గుళికలు చల్లడంకానీ, మిథైల్‌పెమటాన్‌ మందులను వాడి నివారించవచ్చన్నారు.  కార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం ఏవో పద్మజ, శాస్త్రవేత్త ప్రత్యూష, ఏవో శివశంకర్‌రెడి ్డ, గ్రామ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:40:04+05:30 IST