మత్స్య సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమిదే విజయం

ABN , First Publish Date - 2021-10-19T05:08:14+05:30 IST

వైరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమి విజయఢంకా మోగించింది

మత్స్య సొసైటీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమిదే విజయం
ఓటుహక్కు కోసం బారులుతీరిన ఓటర్లు

వైరా, అక్టోబరు 18: వైరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమి విజయఢంకా మోగించింది. 9 డైరెక్టర్లకుగానూ ఈ కూటమి 7 డైరెక్టర్లను ఏకపక్షంగా గెల్చుకుంది. కాంగ్రె్‌స రెండు డైరెక్టర్లు లభించింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరికి సంబంధించిన డైరెక్టర్‌ ఓట్ల లెక్కింపు మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ డైరెక్టర్‌ పదవికి రీకౌంటింగ్‌ నిర్వహించారు. ఇది రాత్రి వరకు పలుసార్లు రీకౌంటింగ్‌తోనే ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొదట ఓట్ల లెక్కింపులో సీపీఎం అభ్యర్థికి ఒక ఓటు మెజార్టీ రాగా రీకౌంటింగ్‌కు కాంగ్రెస్‌ వారు కోరారు. రెండోసారి రీకౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి రెండు ఓట్లు పెరిగాయి. మళ్లీ సీపీఎం, టీఆర్‌ఎస్‌ నాయకులు రీకౌంటింగ్‌ కోరటంతో మూడోసారి రీకౌంటింగ్‌ నిర్వహించగా ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. దాంతో డ్రా తీయడంతో విజయం కాంగ్రెస్‌ను వరించింది.

విజేతల వివరాలిలా ఉన్నాయి.

టీఆర్‌ఎ్‌సకు చెందిన షేక్‌.ఉద్దండు 491ఓట్లు, షేక్‌.సైదులు 384, మంకెన నర్సింహారావు 349, షేక్‌.చాంద్‌మియా 346, షేక్‌.రహీం 320ఓట్లతో విజయం సాధించారు.

సీపీఎంకు చెందిన షేక్‌.రహీం 419ఓట్లు, చింతనబోయిన రామారావు 356ఓట్లతో గెలిచారు.

కాంగ్రె్‌సకు చెందిన షేక్‌.జానిమియా 444ఓట్లతో విజయం సాధించారు.

అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో కాంగ్రె్‌సకు చెందిన గుడిమళ్ల జ్ఞానరత్తయ్య విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి టి.వెంకటేశ్వర్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమికి చెందిన నాయకులు, విజేతలు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.


 భారీగా పోలింగ్‌


 హోరాహోరీగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన వైరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారీ పోలింగ్‌ నమోదైంది. 900మంది ఓటర్లకుగానూ 857మంది(95.22శాతం)ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి టి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ జరిగింది. వైరా రైతు శిక్షణ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐదుగంటలపాటు పోలింగ్‌ జరిగింది. 4పోలింగ్‌ బూతులను ఏర్పాటుచేశారు.  అధికార టీఆర్‌ఎస్‌, సీపీఎం ఒక కూటమిగా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒంటరిగా ఈ ఎన్నికల్లో తలపడ్డారు. వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాల్లోని 11గ్రామాలకు చెందిన మత్స్యకారులైన ఓటర్లు అలాగే ఆయా పార్టీల నాయకులు కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై ఉదయం ఏడుగంటలకే భారీగా వైరాకు తరలివచ్చారు. తమతమ ప్యానల్స్‌కు సంబంధించిన అభ్యర్థులు, ఎన్నికల గుర్తులతో భారీ ప్లెక్సీలు రోడ్డు ముందుభాగంలో ఏర్పాటుచేశారు. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి నాలుగు టేబుల్స్‌లో ఈ ఓట్ల లెక్కింపు చేపట్టారు. వైరా ఎస్‌ఐ వి.సురేష్‌ ఆధ్వర్యంలో వైరా, తల్లాడ పోలీసు సిబ్బంది ఇక్కడ బందోబస్తు ఏర్పాటుచేశారు. 


Updated Date - 2021-10-19T05:08:14+05:30 IST