ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుతో విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2022-05-26T10:32:39+05:30 IST

అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి.. తన భర్త హత్య కేసును విచారించాలని నీరజ్‌ భార్య సంజన పన్వార్‌ డిమాండ్‌ చేశారు.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుతో విచారణ జరిపించాలి

-నీరజ్‌ హత్యపై భార్య సంజన.. హోం మంత్రికి వినతి

అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి.. తన భర్త హత్య కేసును విచారించాలని నీరజ్‌ భార్య సంజన పన్వార్‌ డిమాండ్‌ చేశారు. ఆరుగురితో కలిసి తన పెద్దనాన్న కొడుకు నీరజ్‌ను హతమార్చారని హోంమంత్రి మహమూద్‌ అలీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం బేగంబజార్‌కు చెందిన రాజస్థానీ సైనిక్‌ క్షత్రియ సమాజ్‌ అధ్యక్షులు రాంపాల్‌ దేవడా, సీతల్‌ దేవడా, మేఘరాజ్‌, నిషా పవార్‌, మున్నాలాల్‌ బాటి హోంమంత్రిని కలిశారు. పోలీసులు ఆరుగురు నిందితులను పట్టుకొని జైలుకు పంపి చేతులు దులుపుకోవడం కాదని, తనకు పట్టిన గతి మరే ఆడపిల్లకు పట్టవద్దని కోరారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా కేసు విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. 

Updated Date - 2022-05-26T10:32:39+05:30 IST