గిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-09-21T05:55:19+05:30 IST

గిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, జిల్లా మహిళ

గిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలి

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు


ఏసీసీ, సెప్టెంబరు 20 : గిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవిలు పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిరిజన హాస్టల్‌ లో పనిచేసే దళిత మహిళ స్వప్న ఆత్మహత్య పాల్పడటానికి డీటీడీవోతోపాటు ముగ్గురు వార్డెన్లు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పీఓ మిశ్రా చేసి న విచారణ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ అధికారులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.


డీటీడీఏ లాంటి అధికారి హాస్టల్‌లో దావతులు చేసుకోవడం ఏమిటన్నారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని, అది తట్టుకోలేకే ఆ త్మహత్యకు పాల్పడి ఉంటుందని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు.  స్వప్న మరణంపై  రిటైర్డ్‌ జడ్జితో  విచారణ జరపాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుందన్నారు. మల్యాల శ్రీనివాస్‌, రంగ శ్రీశైలం, బోయిన హరికృష్ణ,  గుర్రాల లావణ్య, బల్ల రమేష్‌, మహేష్‌ పారిక్‌,  కిషోర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T05:55:19+05:30 IST