దుండగులను ఉరి తీయాలి

ABN , First Publish Date - 2021-07-30T04:57:19+05:30 IST

పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాకు చెందిన కేతావత్‌ భామినిని హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరి తీ యాలని గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దుండగులను ఉరి తీయాలి
కొల్లాపూర్‌ ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో హంతకుల దిష్టిబొమ్మను దహనం చేస్తున్న గిరిజన సంఘం నాయకులు

- గిరిజన సంఘం నాయకుల డిమాండ్‌

- కొల్లాపూర్‌ ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో రాస్తారోకో

- హంతకుల దిష్టిబొమ్మ దహనం

కొల్లాపూర్‌, జూలై 29:  పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాకు చెందిన కేతావత్‌ భామినిని హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరి తీ యాలని గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొల్లాపూర్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.  హంతకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ బతుకు దెరువు కోసం  హైదరాబాద్‌కు వెళ్లిన గిరిజన కుటుంబా నికి రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భామిని అతి దారుణంగా హత్య చేసి నగలను దోచుకెళ్లారని దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ప్ర భుత్వం అందించాలని గిరిజన సంఘం నాయకు లు కోరారు. కార్యక్రమంలో యంగంపల్లి తండా సర్పంచ్‌ గోపీనాయక్‌, బోడబండతండా రామ్‌నాయ క్‌, కేతావత్‌ శంకర్‌, పాప్లవత్‌ గోవింద్‌నాయక్‌, ప్రభావత్‌ అశోక్‌నాయక్‌, మూడావత్‌ దశరథం నా యక్‌, భాస్కర్‌నాయక్‌, హరిలాల్‌నాయక్‌, శంకర్‌ నాయక్‌, మహేష్‌నాయక్‌, నర్సింహానాయక్‌, చందర్‌ నాయక్‌, గోపాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

  కఠినంగా శిక్షించాలి

 బల్మూరు : గిరిజన మహిళను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరి జన సంఘం నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్‌ దేశ్యనాయక్‌, జిల్లా కార్యదర్శి ఎం.శంకర్‌ నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో రోజురోజుకు దళిత, గిరిజన మహిళలపై దాడులు, హత్యలు, హత్యాచారాలు జరగడాన్ని తె లంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.  

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

 ఉప్పునుంతల :  గిరిజన మహిళ కేతావత్‌ భామిని హత్య చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని  గిరిజన నాయకుడు బోట్టు పర్వతాలు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షల  ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని  ఉదోగ్య సంఘాల నాయ కులు రూప్‌లానాయక్‌, చందూనాయక్‌, రాజునా యక్‌, రాంజీనాయక్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-07-30T04:57:19+05:30 IST