Abn logo
Jul 22 2021 @ 00:15AM

ముంచుకొస్తున్న మూడో ముప్పు

- జిల్లాలో మళ్లీ మొదలైన సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌

- పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

- మద్దుట్ల...ఎండపల్లిల్లో లాక్‌డౌన్‌ అమలు

జగిత్యాల, జూలై 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మూడో ముప్పు ముంచుకొస్తోంది. జిల్లాలో కొవిడ్‌ మరో మారు విజృంభిస్తోంది. రోజురో జుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజే ఐదుగురు వ్యక్తులు కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ కన్ను మూసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ని పల్లెల్లో మళ్లీ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లు ప్రారంభమయ్యాయి. నెల రోజులు గా జిల్లాలో సగటున 30 నుంచి 40 వరకు ఉన్న పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 50 నుంచి 70 వరకు నమోదు అవుతున్నాయి. కరోనా నివార ణ నిబంధనలను కచ్చితంగా ప్రజలు పాటిస్తే మినహా మహమ్మారీ బా రిన పడకుండా ఉండే వీలుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

రెండు గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌....

కరోనా ఉదృతిని అదుపులో ఉంచడంలో భాగంగా జగిత్యాల జిల్లాలో ని రెండు గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ మళ్లీ ప్రారంభమైంది. వెల్గటూరు మండలంలోని ఎండపల్లి, మల్యాల మండలంలోని మద్దుట్ల గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఎండపల్లి గ్రామంలో  రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన ఒకరు మృతి చెందడం, దీనికి తోడు గ్రా మంలో 12 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో గ్రామస్థులు సెల్ఫ్‌ లా క్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19వ నుంచి ఆగస్టు 1వ తేదీ వ రకు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ గ్రామంలో అమలులో ఉండేలా నిర్ణయం తీసుకొని పాటిస్తున్నారు. గ్రామంలో గుంపు గుంపులుగా పర్యటిస్తే రూ. వెయ్యి జ రిమానాను గ్రామ పంచాయతీకు చెల్లించాలని తీర్మానించారు. గ్రామం లోని దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్ర మే తెరిచి ఉంచడానికి సడలింపు ఇచ్చారు. దుకాణదారులు ఉల్లంగిస్తే రూ. 2 వేల జరిమానా, మాస్క్‌ లేకుండా రహదారులపైకి వస్తే రూ. వె య్యి జరిమానా నిర్ణయించారు. గ్రామంలో బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని, గ్రామస్థుల ఏకాభిప్రాయాన్ని దిక్కరిస్తే నిర్వాహకునికి రూ. 5 వేల జరిమానా విధించడానికి పంచాయతీ పాలకవర్గం, గ్రామా భివృద్ధి కమిటీ సభ్యులు నిర్ణయించారు. జిల్లాలోని మల్యాల మండలం లోని మద్దుట్ల గ్రామంలో సైతం సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.  రెండు రోజులుగా గ్రామంలో 33 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 20వ తేదిన 22 కేసులు, 21వ తేదీన 11 కేసులు నమోదు అ య్యాయి. గ్రామంలో అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


జిల్లా ఆసుపత్రిలో ఐదుగురు పాజిటివ్‌ రోగుల మృతి....

జగిత్యాల జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రిలో ఒకే రోజు ఐదుగురు పా జిటివ్‌ రోగులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వెల్గటూరు మండలంలోని గొడిసెలపేటకు చెందిన వృద్ధుడు(60), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండ లంలోని చింతలపల్లికి చెందిన 55 సంవత్సరాల మహిళ, జగిత్యాల మండలంలోని దరూర్‌కు చెందిన 85 సంవత్సరాల వృద్ధుడితో మరో ఇ రువురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృదిచెందినట్లు ప్రచారం జ రుగుతోంది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బారిన ప డిన 13 మంది చికిత్సను తీసుకుంటున్నారు. జిల్లాలోని మల్యాల, వెల్గ టూరు మండలాలతో పాటు పలు గ్రామాల్లో కరోనా బారిన పడిన వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల సలహాలను పాటిస్తున్నారు. 

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు...

కరోనా థర్డ్‌వేవ్‌ పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండు, మూడు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసు లు పెరుగుతుండడం, మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. నెల రోజుల క్రితం జిల్లాలో సగటున రోజుకు 30 నుంచి 40 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో సగటున రోజుకు 50 నుంచి 70 కేసులు నమోదు అవుతున్నాయి. రెండు నెలల క్రితం జి ల్లాలో రోజుకు సగటున 400 నుంచి 500 వరకు కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. జిల్లాలో అధికార యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా కరోనా తగ్గుముఖం పట్టింది. మళ్లీ రెండు, మూడు రోజులుగా  పాజిటివ్‌ కేసుల సంఖ్యల పెరుగుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. 

జాగ్రత్తలు పాటిస్తేనే మేలు....

జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడడానికి అవసరమైన జా గ్రత్తలు పాటించాలని వైద్య శాఖాధికారులు ప్రచారం చేస్తున్నారు. భౌతి క దూరం పాటించడం, ప్రజలు అవసరముంటేనే ఇళ్ల నుంచి బయటకు రావడం, మాస్క్‌లను ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, చేతు లు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. కరోనా లక్ష ణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను, సిబ్బందిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు.