దొంగలు పడ్డారు..

ABN , First Publish Date - 2021-09-18T06:06:24+05:30 IST

జిల్లాలో పట్టపగలే దొంగలు పడ్డారు. పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. ఓ బ్యాంకులో చోరీ యత్నం జరిగింది. ఇందులో 10 తులాలకుపైగా బంగారం, రూ.3లక్షలకుపైగా నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించారు.

దొంగలు పడ్డారు..

వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు.. 

10తులాలకు పైగా బంగారం, రూ.3లక్షలకుపైగా నగదు అపహరణ


జిల్లాలో పట్టపగలే దొంగలు పడ్డారు. పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. ఓ బ్యాంకులో చోరీ యత్నం జరిగింది. ఇందులో 10 తులాలకుపైగా బంగారం, రూ.3లక్షలకుపైగా నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించారు. 


గొందిపల్లిలో.. 

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 17: మండలంలోని గొందిపల్లిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ స భ్యుడు సూర్యనారాయణరెడ్డి ఇంటిలో గురువారం చోరీ జరిగింది. కియ పోలీ్‌సస్టేషన ఎస్‌ఐ సునీత తెలిపిన  మేరకు గొందిపల్లి గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి గురువారం ఇంటికి తాళం వేసి తాళం చెవిని బాత్రూమ్‌లో పెట్టి  పెనుకొండకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు గురువారం సాయంత్రం బాత్రూమ్‌లోని తాళాలతో ఇంటి తలుపులు  తెరిచారు. బీరువా పగులకొట్టి అందులోని రూ.3లక్షలు న గదు, 10 తులాల బంగారం తస్కరించారని బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడన్నారు. ఫిర్యాదు మేరకు శుక్ర వారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిసరాల్లో విచా రించామన్నారు. అనంతపురం నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పిం చి చోరీ జరిగిన ఇంట్లో వేలి ముద్రలు పరిశీలించామ న్నారు.


పట్టపగలే రెండిళ్లలో... 

తనకల్లు: జాతీయ రహదారి 42 పక్కనే ఇళ్లు, నిత్యం రద్దీగా ఉండే రహదారి, రోడ్డుకు ఇ రువైపులా జనాలు, అయినా దొంగలు పట్టపగలే తాళాలు వేసిన ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి చోరీ చేసిన సంఘటన మండలంలోని నల్లగుట్లపల్లిలో శుక్రవారం జరిగింది. బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరుణమ్మ తన ఇంటికి తాళం వేసి కూలి పనుల కోసం వెళ్లింది. అరుణమ్మ ఇంటి పక్కనే ఉన్న కుమార్‌రెడ్డి కూడా తన ఇంటికి తాళం వేసి బోరు మెకానిక్‌ కోసం వెళ్లాడు. భార్య పక్కనే ఉన్న అంగడికి వెళ్లింది.  దీన్ని గమనించిన దుండగులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి ఇంటి లోపలికి వెళ్లి బీరువాను పగులకొట్టి చోరీ చేశారు. అరుణమ్మ ఇంటిలో రెండు జతలు కమ్మలు, మాటీలు, రెండు ఉంగరాలు, రెండు గొలుసులు, రూ. 20 వేలు నగదు చోరీ చేశారు. కుమార్‌రెడ్డి ఇంటిలో ఒక జత కమ్మలు, చెవులకు వేసుకునే చైనలు, రెండు ఉంగరాలు, రూ. 5 వేలు నగదు తస్కరించారు.


ఏపీజీబీలో చోరీ యత్నం

అనంతపురం క్రైం: నగరంలోని రాజురోడ్డులోని ఆంధ్రప్రగతి బ్యాంకు (ఏపీజీబీ) శాఖలో గురువారం రాత్రి చోరీకి యత్నించారు. వనటౌన పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు బ్యాంకు కిటికీతొలగించి, లోపలికి చొరబడ్డారు. బ్యాంకులో ల్యాకర్లు పగడ్బందీగా ఉండటంతో నగదు, బంగారు నగలు దొరకలేదు. ఎక్కడా ఏవీ కనిపించకపోవడంతో దుండులు వెనుదిరిగారు. శుక్రవారం ఉదయం విధులకు హజరైన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. వనటౌన పోలీసులు, క్లూస్‌ టీం బ్యాంకులో పరిశీలన చేశారు. రెండు గంటలపాటు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఒక వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించినట్లు కనిపించినట్లు తెలిసింది. దీంతో బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు వనటౌన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-18T06:06:24+05:30 IST