భక్తుల సమక్షంలోనే ఆలయ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-06-20T05:18:19+05:30 IST

ప్రజల కోసం నిర్మించిన ఆలయాన్ని భక్తులు లేకుండా ప్రారంభించడం సరికాదని, పరిస్థితులు అనుకూలించినప్పుడే అందరి

భక్తుల సమక్షంలోనే ఆలయ ప్రారంభోత్సవం
వేంకటేశ్వరాలయ ఫొటో ఆల్బంను పరిశీలిస్తున్న చినజీయర్‌స్వామి

 ఆగస్టు లేదా నవంబర్‌లో ముహుర్తం నిర్ణయం

త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి 

 దుబ్బాక వేంకటేశ్వరాలయ ప్రారంభోత్సవం వాయిదా


దుబ్బాక, జూన్‌ 19: ప్రజల కోసం నిర్మించిన ఆలయాన్ని భక్తులు లేకుండా ప్రారంభించడం సరికాదని, పరిస్థితులు అనుకూలించినప్పుడే అందరి సమక్షంలో దుబ్బాక వేంకటేశ్వరాలయాన్ని ప్రారంభించాలని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి వాఖ్యానించారు. కొత్త మంజులా ప్రభాకర్‌రెడ్డితో కలిసి దుబ్బాక బాలాజీ వేంకటేశ్వరాలయ ట్రస్టుసభ్యులు శుక్రవారం ముచింతల్‌లోని జీయర్‌ ఆశ్రమంలో స్వామిని కలిశారు. ఈ నెల 27న ఆలయాన్ని ప్రారంభించాలని మొదట అనుకున్న నేపథ్యంలో స్వామితో చర్చించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఆల్బంను స్వామివారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం చేయడం తగదని స్వామివారు వాయిదావేశారు. ప్రజల కోసం నిర్మించే ఆలయ ప్రారంభోత్సవం... ప్రజలు లేకుండా నిర్వహించడం తగదని సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో దుబ్బాకలో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారు. మహోన్నతమైన కార్యాన్ని ప్రజల సమక్షంలో చేయడమే సముచితమని, అందుకోసం కొద్దిరోజులు వేచిచూడాలన్నారు. దక్షిణాయనంలోనే ఆలయ ప్రారంభోత్సవం నిర్వహిద్దామని, ఆగస్టు, నవంబర్‌లో ముహూర్తాన్ని నిర్ణయిస్తామన్నా రు. స్వామిని కలిసినవారిలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్‌.రాజమౌళి, శ్రీధర్‌, చింతరాజు, సీబీ వెంకటేశం ఉన్నారు.

Updated Date - 2021-06-20T05:18:19+05:30 IST