దోపిడీ

ABN , First Publish Date - 2020-05-21T09:04:20+05:30 IST

ధాన్యం రైతు దోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతు న్నాడు. బస్తా

దోపిడీ

హమాలీ పేరిట బస్తాకు రూ. 10 వసూలు 

జిల్లాలో 44 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణే లక్ష్యం  

ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 12,673 టన్నులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ధాన్యం రైతు దోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతు న్నాడు. బస్తా బరువు పేరిట కిలో ధాన్యం దోచుకుంటున్నారు. అలాగే హమాలీ పేరిట బస్తాకు రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 


రంగారెడ్డి జిల్లాలో ఈసారి రబీలో 12 వేల హెక్టార్ల విస్తీ ర్ణంలో వరిసాగు చేశారు. 44 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికా రులు అంచనా వేశారు. అంచనా మేరకు జిల్లాలో 18 ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో పీఏసీఎస్‌ పరిధిలో.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, తల కొండపల్లి మండలం వెల్జాల్‌, పడ్కల్‌, ఆమనగల్లు, కొందుర్గు, శంకర్‌పల్లి మండలం మోకిల, మల్కారం, కందుకూరు, కేశంపేట, మహేశ్వరంలో ఏర్పాటు చేశారు. అలాగే డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో మంచాల మండలం నోముల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, షాబాద్‌ మండలం షాద్‌నగర్‌, యాచారం, మహే శ్వరం మండలం బండరావిర్యాల, హయత్‌నగర్‌ మండలం బాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లిలో ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 10 నుంచి ఈ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 3,532 మంది రైతుల నుంచి 12,673 టన్నులు ధాన్యం (23.25 కోట్ల విలువ)ను కొనుగోలు చేశారు. రూ.17.76 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ. 5.49 కోట్లు చెల్లించాల్సి ఉంది. 


బస్తాకు కిలో దోపిడీ

బస్తా బరువు పేరిట కిలో ధాన్యాన్ని దోచుకుంటు న్నారు. వాస్తవంగా బస్తా బరువుకు 580 గ్రాముల ధాన్యం తీసుకోవాలి కానీ.. వేయి గ్రాముల ధాన్యం తీసుకుంటున్నారు. బస్తాకు అదనంగా 420 గ్రాముల ధాన్యం ఎక్కువగా తీసుకుంటు న్నారు. బస్తాలో 41 కిలోలు తూకం వేసి కిలో పక్కకు వేసుకుని 40 కిలోల బస్తాను ఓకే చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో బస్తాకు కిలో నుంచి రెండు కిలోల వరకు దోపిడీ చేస్తున్నారు. ఒక రైతు సుమారు 250 బస్తాల వరకు విక్రయించిన చోట 250 కిలోల ధాన్యం నష్టపోతున్నాడు. 


హమాలీ ఎక్కువే..

రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించాలంటే హమాలీ ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం బస్తాలను వాహనంలోకి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. బస్తాకు రూ.13 హమాలీ చార్జ్‌ వసూలు చేస్తున్నారు. 


బకాయిలు రూ. 5.49 కోట్లు

వరి ధాన్యం విక్రయించిన రైతులకు కేవలం 48 గంటల్లోనే ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో డబ్బును జమ కావాల్సి ఉం డగా వారానికి పైగా సమ యం పడుతుందని రైతులు వాపోతున్నారు. పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ ద్వారా వరి ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు ఏ- గ్రేడ్‌కు రూ.1,835, కామన్‌ రకానికి రూ. 1,815 రైతుల ఖాతాల్లో ఆన్‌ లైన్‌లో చెల్లిస్తున్నారు. ఇంకా రూ.5.49 కోట్లు చెల్లించాల్సి ఉంది.


కష్టానికి ఫలితం దక్కడంలేదు - ఎస్‌. విఠల్‌రెడ్డి, రైతు, కందుకూరు 

కష్టానికి ఫలితం దక్కడం లేదు. 5 ఎకరాల్లో వరి వేశా. రూ. 2లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాను. వర్షానికి 30శాతం వరి పంట దెబ్బతిన్నది. మొత్తం 243 బస్తాల వరి ధాన్యం కొనుగోలు  కేంద్రానికి తరలించాను. 243 బస్తాలకు కిలో చొప్పున కట్‌ చేశారు. అలాగే బస్తాకు రూ.10 రూపాయల చొప్పున రూ.2,430 హమాలీ చార్జ్‌ వసూలు చేశారు.  

Updated Date - 2020-05-21T09:04:20+05:30 IST