జిల్లాలో వందశాతం వ్యాక్సినేషనే లక్ష్యం

ABN , First Publish Date - 2021-09-17T04:49:17+05:30 IST

జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగాపెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో వందశాతం వ్యాక్సినేషనే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెం బరు 16: జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగాపెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం గా 45రోజులపాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా వెనకబడి ఉందని అందుకోసం ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లాలో ఇప్పటివరకు లక్షమంది మొదటి డోసు, 80వేలమంది రెండోడోసు టీకాలను వేయించు కున్నారని అన్నారు. ఇంకా సుమారు 3లక్షల మంది టీకా వేసుకోవాల్సి ఉందన్నారు. ఇకపై ఇంటింటికి తిరిగి టీకాలు వేస్తారన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతిరోజు ప్రతికేంద్రంలో వందమందికి టీకాలువేసే లక్ష్యం పెట్టు కున్నామన్నారు. ఉపాధ్యాయులందరూ టీకాలు వేసుకో వాలని లేకపోతే పాఠశాలలోకి అనుమతించమ న్నారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ను విజయ వంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.

వ్యాక్సినేషన్‌ లక్యాన్ని పూర్తిచేయాలి..

వాంకిడి: తొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. గురువారం వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌పై నిర్వహించిన అవగాహనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోని వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎంహెచ్‌వో మనోహర్‌, డీప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌,  ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ మధుకర్‌, వైద్యాధికారి సతీష్‌, వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T04:49:17+05:30 IST