ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-09T09:52:45+05:30 IST

ప్రేమించిన యువతి తనను కాదని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్థాపం చెందిన యువకుడు క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

బుక్కరాయసముద్రం, జూలై8: ప్రేమించిన యువతి తనను కాదని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్థాపం చెందిన యువకుడు క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన దివాకర్‌రెడ్డి (28) అనే యువకుడు అనంతపురంలోని ఓ ఎరువుల దుకాణంలో పనిచేస్తుండేవాడు. గత మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి ఇటీవలే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.


దీంతో అప్పటి నుంచి మనస్థాపానికి గురైన దివాకర్‌రెడ్డి జీవితంపై విరక్తి చెందాడు.  ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మండల పరిధిలోని రేగడికొత్తూరు గ్రామం వద్ద క్రిమి సంహారక మందుసేవించి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Updated Date - 2020-07-09T09:52:45+05:30 IST