రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు తిరుగులేదు: నామా

ABN , First Publish Date - 2021-10-20T05:00:58+05:30 IST

రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు లేదని ఎంపీ, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు తిరుగులేదు: నామా
మాట్లాడుతున్న ఎంపీ నామా, వేదికపై ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా, అక్టోబరు 19: రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు లేదని ఎంపీ, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకొని మంగళవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. ఈనెల 25న జరిగే రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను అలాగే వచ్చేనెల 15న వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని స్పష్టం చేశారు. మూడోసారి కేసీఆర్‌ సీఎం కావడమే లక్ష్యంగా ఇప్పటినుంచే ప్రతి ఒక్కరూ సైనికులు మాదిరిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 


సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ


వైరా మండలంలోని 11మందికి రూ.3.82లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములునాయక్‌ పంపిణీ చేశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నలమల వెంకటేశ్వరరావు, వైరా మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.


కమ్మవారి కల్యాణమండపాన్ని సందర్శించిన నామా


వైరాలో కమ్మజన సేవాసమితికి చెందిన కమ్మవారి కల్యాణమండప ఆధునీకీకరణ నిర్మాణాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం సందర్శించి పరిశీలించారు. రూ.కోటికిపైగా వ్యయంతో ఈ కల్యాణమండపాన్ని ఏసీ కల్యాణమండపాన్ని ఆధునీకరిస్తున్నారు. ఈ కల్యాణమండప నిర్వహణ కమిటీ విజ్ఞప్తి మేరకు ఎంపీ సందర్శించారు. ఆధునీకీకరణ నిర్మాణానికి తాను పూర్తి సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కమిటీని అభినందించారు. కమిటీ నిర్వాహాకులు అడపా రామకోటయ్య, చింతనిప్పు వెంకటయ్య, కట్టా కృష్ణార్జున్‌రావు, దామా వీరయ్య, పూసలపాడు సొసైటీ అధ్యక్షుడు గాలి శ్రీనివాసరావు, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నలమల వెంకటేశ్వరరావు, నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి పాల్గొన్నారు.


తనికెళ్ల సీసీ రోడ్లకు రూ.10లక్షలు మంజూరు


కొణిజర్ల: ఇటీవల తనికెళ్ల గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన హామీ మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావు నిధులు మంజూరు చేశారు. మంగళవారం తనికెళ్లలో సర్పంచ్‌ చల్లా మోహన్‌రావు నిధుల మంజూరు హామీ విషయాన్ని ఎంపీ నామా దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన నామా అక్కడికక్కడే రూ.పదిలక్షల మంజూరు ఆదేశాలు ఇచ్చారు. నామాకు మోహన్‌రావు, సుడా డైరెక్టర్‌ బండారి కృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నామా వెంట రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నలమల వెంకటేశ్వరరావు, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, పోట్ల శ్రీనివాసరావు, చిత్తారు సింహాద్రి, పోగుల శ్రీనివాసరావు, మౌలానా, జడ్పీటీసీ పోట్ల కవిత, రైతుబంధు మండల కన్వీనర్‌ కిలారు మాధవరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:00:58+05:30 IST