టాబ్లెట్‌ బదులు పొరపాటున AirPod ను మింగేసిన 27 ఏళ్ల యువతి.. ఆ తర్వాతే ఆమెకు అసలు కష్టాలు స్టార్ట్.. చివరకు..!

ABN , First Publish Date - 2021-11-19T23:51:48+05:30 IST

కార్లీ బెల్లర్(27) అనే యువతికి వళ్లు నొప్పులు ఎక్కువగా ఉండడంతో మెడికల్ స్టోర్‌కు వెళ్లి నొప్పి నివారణ టాబ్లెట్లను తెచ్చుకుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడే ఆమెకు అసలు సమస్య మొదలైంది. పరధ్యానంలో ఉన్న ఆమె..

టాబ్లెట్‌ బదులు పొరపాటున AirPod ను మింగేసిన 27 ఏళ్ల యువతి.. ఆ తర్వాతే ఆమెకు అసలు కష్టాలు స్టార్ట్.. చివరకు..!

పరధ్యానంలో కొందరు ఒక్కోసారి విచిత్రమైన పనులు చేస్తుంటారు. చివరగా విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటారు. అయితే అలాంటి వ్యక్తులు చేసే పనులు.. ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంటాయి. 27 ఏళ్ల ఓ యువతి పొరపాటున టాబ్లెట్‌కు బదులుగా AirPod ను మింగేసింది. తర్వాత విషయం తెలుసుకుని లబోదిబోమంది. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..


కార్లీ బెల్లర్(27) అనే యువతికి వళ్లు నొప్పులు ఎక్కువగా ఉండడంతో మెడికల్ స్టోర్‌కు వెళ్లి నొప్పి నివారణ టాబ్లెట్లను తెచ్చుకుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడే ఆమెకు అసలు సమస్య మొదలైంది. పరధ్యానంలో ఉన్న ఆమె.. ఓ చేతిలో టాబ్లెట్స్‌ని, మరో చేతిలో బ్లూటూత్ AirPod లను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది. టాబ్లెట్ వేసుకునేందుకు నీళ్లు తీసుకుంది. అయితే టాబ్లెట్ బదులుగా ఇంకో చేతిలో ఉన్న AirPod లలో ఒక దాన్ని తీసుకుని మింగేసింది. అయితే కొద్దిసేపటికి చేతిలో చూసుకుంటే టాబ్లెట్ అలాగే ఉంది. ఇంకో చేతిలో రెండు ఉండాల్సిన AirPod లలో ఒకటే ఉంది. చివరకు కడుపులో వికారంగా ఉండడంతో భయాందోళనకు గురైంది.


తన కడుపులోని AirPod కు, ఫోన్‌కు కనెక్ట్ చేయగా పని చేసింది కానీ.. ఎలాంటి శబ్ధమూ వినబడలేదని ఆ యువతి పేర్కొంది. అయితే సాయంత్రం వరకూ వేచి చూడగా జీర్ణ వ్యవస్థ గుండా బయటికి వెళ్లిందని గ్రహించింది. అయినా అనుమానం ఉండడంతో వైద్యులను సంప్రదించగా ఎక్స్‌రే తీశారు. అయితే లోపల ఎలాంటి వస్తువూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. తన బాధనంతా వివరిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-11-19T23:51:48+05:30 IST