వెండి తెరచుకున్నాయ్‌

ABN , First Publish Date - 2021-07-31T05:57:37+05:30 IST

కరోనా తగ్గుముఖంతో ఎట్టకేలకు బొమ్మపడింది. గత ఏడాది మార్చి 15వ తేదీన మూతపడి న థియేటర్లు శుక్రవారం తిరిగి పునః ప్రారంభమయ్యాయి. అంటే సుమారు సంవత్స రంపైగా థియేటర్లు మూతపడ్డా యి. తాజాగా, శుక్రవారం నల్లగొండలోని తిరుమల, ఎస్‌వీసీ క్రియేషన్స్‌ థియేటర్లు, దేవరకొండలో ఒకటి, మిర్యాలగూడలో ఒకటి తెరుచుకోగా, మిగిలిన థియేటర్ల గేట్లకు మాత్రం తాళాలే దర్శనమిచ్చాయి.

వెండి తెరచుకున్నాయ్‌

ఏడాది తర్వాత పునఃప్రారంభమైన థియేటర్లు

తొలిరోజు సీటింగ్‌ కెపాసిటీలో 10శాతమే వచ్చిన ప్రేక్షకులు 


రామగిరి, జూలై 30: కరోనా తగ్గుముఖంతో ఎట్టకేలకు బొమ్మపడింది. గత ఏడాది మార్చి 15వ తేదీన మూతపడి న థియేటర్లు శుక్రవారం తిరిగి పునః ప్రారంభమయ్యాయి. అంటే సుమారు సంవత్స రంపైగా థియేటర్లు మూతపడ్డా యి. తాజాగా, శుక్రవారం నల్లగొండలోని తిరుమల, ఎస్‌వీసీ క్రియేషన్స్‌ థియేటర్లు, దేవరకొండలో ఒకటి, మిర్యాలగూడలో ఒకటి తెరుచుకోగా, మిగిలిన థియేటర్ల గేట్లకు మాత్రం తాళాలే దర్శనమిచ్చాయి. మొదటిరోజు ప్రేక్షకులు అంతంత మాత్రమే కనిపించారు. సీటింగ్‌ కెపాసిటీలో 10శాతం మాత్రమే వచ్చారు. నెలకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల చొప్పున సంవత్సరానికి రూ.60లక్షల మేర నష్టపోయిన పరిస్థితిలో ఇప్పుడు ప్రారంభించక తప్పలేదని అయా థియేటర్ల యజమానులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ కొంతమేర తగ్గుముఖంపట్టినా ప్రేక్షకుల్లో మాత్రం ఆ భయం వెంటాడుతోంది.


కరోనా నిబంధనలతో ఓపెన్‌ చేశాం : బండారు ప్రసాద్‌, తిరుమల థియేటర్‌ యజమాని

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ప్రారంభించాం. కరోనా కారణంగా గత ఏడాది మార్చి 15వ తేదీ నుంచి థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. సంవత్సరం పైగా బంద్‌ ఉండడంతో రూ.లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది. నేటి నుంచి ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సినిమాకు వచ్చే ప్రేక్షకులు కూడా నిబంధనలు పాటిస్తూ సహకరించాలి.


Updated Date - 2021-07-31T05:57:37+05:30 IST