Abn logo
Oct 21 2021 @ 00:31AM

డాక్టర్లు, సిబ్బంది సేవలు అభినందనీయం

దేవరకొండలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

దేవరకొండ, అక్టోబరు 20: కరోనా కష్టకాలంలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బం ది ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్‌ అందజేసి సేవలు అందించారని బీజేపీ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు గుండాల అంజయ్యయాదవ్‌ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని బుధవారం సన్మానించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీఈ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారన్నారు. కరోనా సమయంలో డాక్టర్‌లు, నర్సులు, ఆశావర్కర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకూరి నర్సింహ, సుధాకర్‌, సాగర్‌, భాస్కర్‌, సహాదేవ్‌, శీను పాల్గొన్నారు. 

మర్రిగూడ: కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్‌ఎంలను బీజేపీ నాయకులు సన్మానించారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీరాంగౌడ్‌ మాట్లాడుతూ కష్టకాలంలో ప్రాణాంతకమైన వైరస్‌తో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలందించారన్నారు.  

చింతపల్లి: వందకోట్ల కరోనా డోసులు పూర్తి చేసిన సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. కృషి చేసిన వైద్యసిబ్బందిని కూడా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శివర్ల రమేష్‌యాదవ్‌, చనమోని రాములు, దావ శ్రీనివాస్‌, బొడ్డు మహేష్‌, కట్ట సైదులు, బాల్‌జంగయ్యగౌడ్‌, జంగయ్య, క్రాంతిరెడ్డి, ముడిగ వెంకటయ్య, శేషు, యాదగిరి, సుమన్‌నాయక్‌, పాల్గొన్నారు. 

పెద్దవూర: దేశంలో వందకోట్ల వ్యాక్సిన్‌ పూర్తి చేసిన సందర్భంగా బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైద్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎరుకొ ండ నరసింహ, మాతంగి నరేందర్‌, చిట్టిమల్ల నరేష్‌, శివ, శంకర్‌నాయక్‌, కంభంపాటి రవి, నులక వెంకట్‌రెడ్డి, నరేష్‌, గోవింద్‌ పాల్గొన్నారు.