Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తి

 ఏఎస్పీ నర్మద 

 పోలీస్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ఓపెన్‌హౌస్‌

నల్లగొండ క్రైం, అక్టోబరు 22: పోలీ స్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవ డం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తి వంతంగా నిలుస్తాయని జిల్లా అదనపు ఎస్పీ నర్మద అన్నారు. ఫ్లాగ్‌డే సందర్భం గా శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో కొవిడ్‌ మార్గదర్శకాల నేపథ్యం లో ఆన్‌లైన్‌ ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీ్‌సశాఖలో వినియోగిం చే ప్రతి ఆయుధంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రతి ఏడాది ఓపెన్‌హౌస్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుధాల అవగాహనపై విద్యార్థులనే పోలీస్‌ స్టేషన్లకు, జిల్లా పోలీస్‌ కార్యాలయానికి ఆహ్వానించేవార మని, ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, ప్రజాసేవకోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, అలాంటి త్యాగదనుల త్యాగాలను స్మరిస్తూనే ఉంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు దేశంలో అంతర్గత భద్ర త, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలాంటి ప్రతి సందర్భంలోనూ పోలీ్‌సశాఖ కీలకంగా పనిచేసిందన్నారు. డాగ్‌ స్క్వాడ్‌, బాంబు డిస్పోజల్‌ టీమ్‌, క్లూస్‌టీంలతోపాటు పలు రకాల ఆయుధాలు వాటి పేర్లు, వినియోగం, ట్రాఫిక్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో వేగం గా వెళ్లే వాహనాలను గుర్తించి చలానాలు విధించ డం, నకిలీ నోట్లను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ సురే్‌షకుమార్‌, ఆర్‌ఐలు స్పర్జన్‌రాజ్‌, నర్సింహాచారి, శ్రీనివాస్‌, కృష్ణారావు, నర్సింహ, ట్రాఫిక్‌ సీఐ చీర్ల శ్రీనివాస్‌, పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement