పోలీసు అమరుల త్యాగాలు మరవలేనివి

ABN , First Publish Date - 2021-10-20T05:34:27+05:30 IST

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

పోలీసు అమరుల త్యాగాలు మరవలేనివి
రక్త దానం చేస్తున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసులు

- సీపీ చంద్రశేఖర్‌రెడ్డి 

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 19: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరానికి హాజరై రక్త దానం చేసిన అనంతరం సీపీ మాట్లాడారు. పోలీసులు ప్రజల రక్షణలో ఎల్లవేళలా ముందుంటారన్నారు. ఇందుకు తీసకునే నిర్ణయాల కు అందరూ సహకరించాలని కోరారు. సేవలందించ డంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్నామని ఆయన వివరించారు. పోలీసు లు అమరుల త్యాగాలు మరువలేనివని ఆయా కుటుంబాలు ఆత్మస్థైర్యంతో ముందుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోలీస్‌ వృత్తి ఎంతో సాహోసేపతమైనదని, బాధ్యతగా మెదులుకోవాలని సిబ్బందికి సూచించారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పడు అత్యవస ర పరిస్థితుల్లో రక్తం ఎంతో ఉపయోగపడుతుం దన్నారు. రక్తదానంతో పాటు అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్‌, ఏసీపీ సాదుల సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, అనీల్‌కుమార్‌, ఎస్సైలు కే రాజేష్‌, ఉపేందర్‌, వెంకటే ష్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, జానీపాషా, రాజవర్దన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:34:27+05:30 IST