గడీల పాలనను అంతం చేయాలి : కోదండరాం

ABN , First Publish Date - 2021-02-25T06:35:44+05:30 IST

పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడీల పాలనను అంతం చేసి, ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం పిలుపునిచ్చారు.

గడీల పాలనను అంతం చేయాలి : కోదండరాం
జిల్లాకేంద్రంలో ప్రచారం చేస్తున్న టీజేఎస్‌ అభ్యర్థి కోదండరాం

నల్లగొండ క్రైం ఫిబ్రవరి 24: పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడీల పాలనను అంతం చేసి, ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని వివిఽధ కళాశాలలు, కార్యాలయాల్లో బుధవారం పట్టభద్రులు, ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనలో ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే అని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నారని, వాస్తవానికి భర్తీ చేసింది కేవలం 77వేలు మాత్రమే అన్నారు. సమావేశంలో పన్నాల గోపాల్‌రెడ్డి, శ్రీధర్‌, శ్రీనివాస్‌, వినయ్‌, కట్టా శ్రీనివాస్‌ ఉన్నారు.
పట్టభద్రుల సమస్యలపై గళమెత్తుతా : సుధాకర్‌
పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించి మండలికి పంపితే నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలపై గళమెత్తుతానని తెలంగాణ ఇంటి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల, మెడికల్‌ కళాశాల, బార్‌ అసోసియేషన్‌తో పాటు కళాశాలలు, వివిధ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాటం సాగించి రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నానని గుర్తుచేశారు. పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపినా వెరవకుండా రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేశానన్నారు. కార్యక్రమంలో నాయకులు సందీప్‌ చమార్‌, సుహాస్‌, సిఽంధుశ్రీ, మూర్తి, మురళి పాల్గొన్నారు.
రాములునాయక్‌ విజయానికి కృషి చేయాలి : శంకర్‌నాయక్‌
దామరచర్ల: కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్‌ను గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ కోరారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఉద్యోగులకు పీఆర్సీని పెంచి, పదోన్నతలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాల భర్తీ ఊసేలేదన్నారు.

Updated Date - 2021-02-25T06:35:44+05:30 IST