అనస్తీషియా వైద్యుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-05-23T05:52:33+05:30 IST

శస్త్ర చికిత్సల్లో అనస్తీషియా వైద్యుల పాత్ర కీలకమని జాతీయ అనస్తీషియా వైద్యుల సంఘ అధ్యక్షుడు డా.భీమేశ్వర్‌ అన్నారు.

అనస్తీషియా వైద్యుల పాత్ర కీలకం
జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న వైద్యులు

 జాతీయ అనస్తీషియా వైద్యుల సంఘ అధ్యక్షుడు భీమేశ్వర్‌


నంద్యాల (నూనెపల్లె), మే 22 : శస్త్ర చికిత్సల్లో అనస్తీషియా వైద్యుల పాత్ర  కీలకమని జాతీయ అనస్తీషియా వైద్యుల సంఘ అధ్యక్షుడు డా.భీమేశ్వర్‌ అన్నారు. భారత జాతీయ అనస్తీషియా వైద్యుల సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి అనస్తీషియా వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డా.రెడ్డిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో డా.భీమేశ్వర్‌ మాట్లాడుతూ అనస్తీషియా వల్ల వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతోనే గుండె, మెదడు, అవయవాల మార్పిడి తదితర ఆపరేషన్లు నిర్వహించే అవకాశం కలిగిందని చెప్పారు. అనస్తీషియాకు సంబంధించిన ఆధునిక మార్పులు, వినియోగించే విధానం, పర్యవసానాలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన  వైద్య ప్రముఖులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌సీ జాతీయ చైర్మన్‌ డా.చక్రధరరావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎలెక్ట్‌, సదస్సు ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డా.రవికృష్ణ, డా.రామకృష్ణారెడ్డి, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు చింతల కిషన్‌, రాష్ట్ర సంఘ కార్యదర్శి డా. అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:52:33+05:30 IST