Abn logo
May 5 2021 @ 23:43PM

రోడ్డుకే అసహ్యమేసేలా..!

రోడ్లకిరువైపులా చెత్త

కాల్వల్లో పేరుకుపోయిన మురుగు

ఇదీ కోఆపరేటివ్‌ కాలనీలోని దుస్థితి

కడప(ఎర్రముక్కపల్లె), మే 5: కడప నగరం 25వ డివిజన్‌ కోఆపరేటివ్‌ కాలనీలో రోడ్లకిరువైపులా చెత్త తిష్ట వేసింది. రోడ్డుకే అసహ్యమేసేలా, చూసే వారికి రోత పుట్టేలా ఉంది. ప్రధాన రహదారిపైనే ఇలా ఉండడంతో స్థానికులు కంపు భరించలేకున్నారు. పైగా ఈ చెత్త కుళ్లి దోమలు వృద్ధి చెంది రేయింబవళ్లు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలకు నిద్ర కరువవుతోంది. వారాల తరబడి శుభ్రం చేయకపోవడం వల్లనే ఈ విధంగా తయారైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య అధికారులు, పాలకులకు తెలిసినా పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. పారిశుధ్య కార్మికులు ప్రధాన రోడ్లకు మాత్రమే పరిమితమని, వీధుల్లోకి రారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు తక్షణం స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement