ప్రజల హక్కులను కాపాడాలి

ABN , First Publish Date - 2022-05-19T06:29:41+05:30 IST

ప్రజల హక్కులను కాపాడాలని, అందుకోసం అధికారు లు చిత్తశుద్ధితో పనిచేయాలని మానవ హక్కుల కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్ర య్య సూచించారు.

ప్రజల హక్కులను కాపాడాలి
మాట్లాడుతున్న జస్టిస్‌ జి చంద్రయ్య, పక్కన డీసీపీ నారాయణరెడ్డి

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి 

 హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ జి చంద్రయ్య


భువనగిరి రూరల్‌, మే18: ప్రజల హక్కులను కాపాడాలని, అందుకోసం అధికారు లు చిత్తశుద్ధితో పనిచేయాలని మానవ హక్కుల కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్ర య్య సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సమస్యలతో మీ వద్దకు వస్తే ఆ సమస్య తమదేగా భావించి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గ్రామాల్లోని ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి సమాన హక్కులను కల్పించింద ని, రాజ్యాంగ హక్కులను ప్రతీ ఒక్కరికి అందే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డీసీపీ కె.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాం సుందర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌ రావు, అధికారులు డీఆర్‌డీవో ఉపేందర్‌ రెడ్డి, సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, ఎస్‌డీసీ విజయకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో మల్లికార్జున్‌, డీఏవో అనురాధ, ఐసీడీఎస్‌ పీడీ కృష్ణవేణి, డీపీవో సునంద తదితరులున్నారు. 


ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి 

ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వారి శిక్షా కాలం తగ్గుతుందని,  జైలు నుంచి విడుదలైన అనంతరం కుటుంబసభ్యులతో మమైకమే సాధారణ జీవితాన్ని గడిపేందుకు వీలుంటుందని జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన భువనగిరి సబ్‌జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. అనంతరం భువనగిరి బార్‌ అసొసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బాధితులకు సరైన న్యాయం అం దే విధంగా చూడాలన్నారు. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ సిజేరియన్‌ ఆపరేషన్లకు స్వస్తిపలికి సాధారణ ప్రసవాలు పెంచే విధంగా వైద్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ చిన్నా నాయక్‌, చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌, బార్‌ అసొసియేషన్‌ ప్రతినిధులు రాంరెడ్డి, జగన్‌మోహన్‌ రెడ్డి, గిరి పాల్గొన్నారు. 


ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత కలుగుతుందని జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. బుధవారం ఆయన కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన ప్రధానాలయంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చ న పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ఉద్ఘాటన అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన మూలమూర్తులను కుటుంబసమేతం గా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.  యాదాద్రీశుడిని మహిళా కమిషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కలు వేర్వేరుగా కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకున్నారు. వీరివెంట దేవస్థాన ఏఈవో గట్టుశ్రవణ్‌కుమార్‌, పర్యవేక్షకుడు ముద్దసాని నరేశ్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు.

Updated Date - 2022-05-19T06:29:41+05:30 IST