ఓటు హక్కు ఆయుధం లాంటిది

ABN , First Publish Date - 2022-01-21T06:05:44+05:30 IST

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఓటు ఒక ఆయుధం లాంటిదని తెలియజెప్పిన మహనీయుడని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావులు అన్నారు.

ఓటు హక్కు ఆయుధం లాంటిది
మేడిపల్లిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

 ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి రూరల్‌, జనవరి 20 : రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఓటు ఒక ఆయుధం లాంటిదని తెలియజెప్పిన మహనీయుడని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావులు అన్నారు. గురువారం మండ లంలోని మేడిపల్లి గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నిరక్షరాస్యతను నిర్మూలిం చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఐక్యతతో ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచులు పీసు తిరుపతిరె డ్డి, ఆరెల్లి లక్ష్మిరాజగౌడ్‌, ఎంపీటీసీ గుండెల నగేష్‌, ఉపసర్పంచులు మి ట్టపెల్లి లింగారెడ్డి, రత్నాకర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు కాటిపెల్లి శ్రీని వాస్‌రెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, మాల సంఘ అధ్యక్షుడు బబ్బిల మోహన్‌, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T06:05:44+05:30 IST