యువకుల కష్టానికి దక్కిన ఫలితం

ABN , First Publish Date - 2021-03-24T07:00:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సోమవారం 2019 సంవత్సరానికిగాను చలన చిత్రరంగానికి సంబంధించి అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో రాష్ర్టానికి చెందిన ఇద్దరు యువకులు నిర్మించిన మరాఠీ చిత్రానికి ఉత్తమ అవార్డు దక్కింది.

యువకుల కష్టానికి దక్కిన ఫలితం

బీబీనగర్‌వాసి  నిర్మాణ సారథ్యం వహించిన చిత్రానికి ఉత్తమ అవార్డు

బీబీనగర్‌, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సోమవారం 2019 సంవత్సరానికిగాను చలన చిత్రరంగానికి సంబంధించి అవార్డులను ప్రకటించింది.  ఈ అవార్డుల్లో రాష్ర్టానికి చెందిన ఇద్దరు యువకులు నిర్మించిన మరాఠీ చిత్రానికి ఉత్తమ అవార్డు దక్కింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా టింప్లీ గ్రామానికి చెందిన లతాకరే అనే వృద్ధురాలు 65 ఏళ్ల వయస్సులో అనారోగ్యం బారిన పడిన తనభర్త ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగుపందెంలో పాల్గొని విజయం సాధిస్తుంది.  ఆమె జీవిత గాఽథ నేపథ్యంలో రూపొందించిన చిత్రమే ‘లతా భగవాన్‌ కరే’. గత ఏడాది ఫిబ్రవరి 3న మహారాష్ట్ర అంతటా విడుదలయి ప్రజాదరణ పొందడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఈచిత్రం నిలిచింది. స్పెషల్‌ మెన్షన్‌ విభాగంలో జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలి నుంచి స్ఫూర్తి పొందిన బీబీనగర్‌ మండలం నెముల గొముల గ్రామానికి చెందిన ఎర్ర బోతు కృష్ణ, నిర్మాణ సారధ్యంలో కరీంనగర్‌కు చెందిన నవీన్‌ దేశబోయిన దర్శకత్వంలో ఆమె కథకు దృశ్యరూపం ఇచ్చారు. తమ చిత్రానికి జాతీయ అవార్డు రావడం పట్ల దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. తాము డబ్బుల కొరకు సినిమా తీయలేదని లతా కరే జీవితం ఎందరికో ఆదర్శం. అలాంటి గొప్ప వ్యక్తి యథార్థ గాధను సమాజానికి తెలియజెప్పాలనే సినిమాను రూపొందించామని తెలిపారు.  

Updated Date - 2021-03-24T07:00:39+05:30 IST