పేదల ఆహారభద్రత హక్కుపై గళమెత్తిన టీడీపీ శ్రేణులు
ABN , First Publish Date - 2022-08-02T06:22:46+05:30 IST
రాష్ట్రంలో పేదలకు నిత్యావసరాల పంపిణీని వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చి, పేదల ఆహారభద్రత హక్కును నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం టీడీపీ శ్రేణులు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాయి.
తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు
చోడవరం, ఆగస్టు 1: రాష్ట్రంలో పేదలకు నిత్యావసరాల పంపిణీని వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చి, పేదల ఆహారభద్రత హక్కును నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం టీడీపీ శ్రేణులు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాయి. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆహారభద్రత పథకాలకు తిలోదకాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అనంతరం తహసీల్దార్ తిరుమలబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో టీడీపీ నాయకులు గునూరు మల్లునాయుడు, మజ్జి గౌరీశంకర్, మత్య్సరాజు, మళ్ల కోటేశ్వరరావు, బొడ్డేడ గంగాధర్, మజ్జి రమణ, దేవరపల్లి వెంకట అప్పారావు, గూనూరు అచ్చిబాబు, ఈర్లె శ్రీను, ఎలకా మల్లిబాబు, రేవళ్లు త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.
బుచ్చెయ్యపేట: ఆహార భద్రతా చట్టానికి సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు విమర్శించారు. సోమవారం ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఉచిత బియ్యాన్ని అందరికీ ఇవ్వాలన్నారు. కేంద్రం అందించిన ఉచిత బియ్యాన్ని మిగుల్చుకోవడానికే వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ జాబితా నుంచి రాత్రికి రాత్రే అర్హుల్ని తొలగించడం ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లఘించడమే అవుతుందన్నారు. అనంతరం తహసీల్దార్ ఎస్వీ.అంబేడ్కర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, సుంకర సూరిబాబు, వియ్యపు అప్పారావు, ఎం.తాతయ్యలు, దొండా నరేష్, కంఠే సత్యనారాయణ, గొన్నాబత్తుల శ్రీనివాసరావు, వజ్రపు శ్రీను, ఆదిరెడ్డి కనకారావు, రమేష్ పాల్గొన్నారు.
దేవరాపల్లి: నిరుపేదలకు అందించాల్సిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించకుండా దోచుకోవడం దారుణమని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం టీడీపీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ అరుణ్‌చంద్రకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిటిమిరెడ్డి సూర్యానారాయణ, ఆదిరెడ్డి వరలక్ష్మి, పోతల పాత్రునాయుడు, కశిరెడ్డి అప్పలనాయుడు, బాబూరావు, సూర్యనారాయణ, నాగేశ్వరరావు, నాయుడు పాల్గొన్నారు.
మాడుగుల: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన బియ్యాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడం తగదని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ పీవీరత్నంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లవిల్లి శ్రీరామమూర్తి, కశిరెడ్డి.అప్పలనాయుడు, గండి గోవింద, కళ్యాణ చక్రవర్తి, అప్పాన వెంకటరమణ, పుట్టాసంతోష్, పాతాల ఆనంద్, అప్పారావు యాదవ్ తదితరుల పాల్గొన్నారు.
కె,కోటపాడు: పేదలకు కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం చేతివాటం చూపిస్తుందని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీకుమార్ విమర్శించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ జె.రమేశ్‌బాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్బవరపు రామునాయుడు, కశిరెడ్డి అప్పలనాయుడు, లెక్కల మల్లేశ్వరరావు, అవతారమూర్తి, సూర్యనారాయణ, బత్తి రమన, రామారావు పాల్గొన్నారు.