వరి కొనుగోలును పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2021-12-05T04:51:59+05:30 IST

వరి కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండగా పకడ్బందీగా చేపట్టాల ని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆదేశించారు.

వరి కొనుగోలును పకడ్బందీగా చేపట్టాలి
గట్టులో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరి క్రాంతి  

- తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

గట్టు, డిసెంబరు 4: వరి కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండగా పకడ్బందీగా చేపట్టాల ని  కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శనివారం మండలంలోని ఆలూరు, రాయపురం, గట్టు గ్రామాల లో కలెక్టర్‌ పర్యటించారు. ఆలూరు, గట్టులో పీఏసీ ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆమె పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, ప్యాడీక్లినర్లు, తేమ శాతం గుర్తించే మిషన్లు అందుబాటులో ఉంచాలని ఆమె  ఆదేశించా రు. పరికరాలన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందే చెక్‌ చేసుకోవాలని సూచించారు. రైతుల ఫోన్‌ నంబర్లుకు తప్పనిసరిగా ఆధార్‌ లింక్‌ చేయా లని, 17శాతం తేమ మించకుండా చూసుకోవాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా అరబెట్టిన త ర్వాతే కేంద్రానికి తీసుకరావాలని  తెలిపారు. ఆయా కేంద్రాల్లో టోకెన్ల జారీ, ఆధార్‌లింక్‌  వంటి వివరాలను సెంటర్‌ ఇన్‌చార్జిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయపురం గ్రామంలో  వ్యాక్సినేషన్‌ కేం ద్రాన్ని పరిశీలించారు. ఆశ వర్కర్లు,  ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాల న్నారు. గ్రామాల్లో వందశాతం పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గట్టు తహసీల్దార్‌ను కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ధ్రువపత్రాల జారీలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాలని తహసీల్దార్‌కు సూచిం చారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ధరణి దరఖాస్తులను పెండిగ్‌లో ఉంచకుండా ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. సర్పంచ్‌ల తో మాట్లాడి ప్రభుత్వ  భూముల్లో మొక్కలు నా టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఎం ప్రసాదరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి రేవతి, వైద్యాదికారి రా జసింహా, తహసీల్దార్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపీడీవో రా ఘవా, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T04:51:59+05:30 IST