Abn logo
Oct 19 2021 @ 22:59PM

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

కాగజ్‌నగర్‌లో ర్యాలీ సందర్భంగా అభివాదం చేస్తున్న మన్సిపల్‌ చైర్మన్‌ సద్దాంహుస్సేన్‌, మత పెద్దలు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 19: కాగజ్‌నగర్‌ పట్టణంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  సాయంత్రం వివిధ కూడళ్ల నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని సర్‌సిల్క్‌ ఏరియా నుంచి ప్రారంభమైంది. లారీచౌక్‌, రాజీవ్‌ గాంధీ చౌరస్తా, అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా పట్టణ పురవీధుల మీదుగా కొనసాగింది.  మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాంహుస్సేన్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో సీఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్సై వెంకటేష్‌, హనుమాండ్ల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ పట్టణంలో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సిర్పూర్‌(టి): మండల కేంద్రంలో ముస్లిం యూత్‌ ఆధ్వర్యంల్‌ ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నమీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పెద్దలు, యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బెజ్జూరు: మండలంలో గోల్కొండ మసీదు నుంచి ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సయ్యద్‌ ఖాజా తాహెర్‌బాబా దర్గాలో చాదర్‌ సమర్పించారు. ఈ కార్యక్రమంలో రహెమాన్‌ ఖాద్రీ, హసీబ్‌ ఖాద్రి, సయ్యద్‌ షా అఫ్జల్‌ కాధ్రి, హఫీజ్‌ ఇర్ఫాజ్‌, ఇమామ్‌ మహ మ్మద్‌ షేక్‌ పుర్ఖాస్‌ రాజా ఖాద్రీ, అమీరుద్దీన్‌, మతీన్‌, యూసుబ్‌ఖాన్‌, మక్బుల్‌హుస్సెన్‌,  మహమూద్‌, సయ్యద్‌ అలీ, అహేమాద్‌, తాహెర్‌ హుస్సెన్‌, సిరాజ్‌, సద్దాం హుస్సెన్‌, షేర్‌ఖాన్‌, నిహాల్‌, జావీద్‌, రియాజ్‌, అక్బర్‌, అన్వర్‌, హైమద్‌, తదితరులు పాల్గొన్నారు.