మన్యంలో బంద్‌ను జయపద్రం చేయాలి

ABN , First Publish Date - 2021-03-05T06:09:40+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం తలపెట్టిన బంద్‌ను ఏజెన్సీలో అన్ని విధాలా జయపద్రం చేయాలని అఖిలపక్షం నేతలు తీర్మానించారు.

మన్యంలో బంద్‌ను జయపద్రం చేయాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు


పాడేరులో అఖిల పక్షం నేతలు తీర్మానం

పాడేరు, మార్చి 4: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం తలపెట్టిన బంద్‌ను ఏజెన్సీలో అన్ని విధాలా జయపద్రం చేయాలని అఖిలపక్షం నేతలు తీర్మానించారు. బంద్‌పై గురువారం ఇక్కడ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఎం, సీపీఐ, గిరిజన సంఘం, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం చాలా అన్యాయమని, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు చేపడుతున్న ఉద్యమాల్లో భాగస్వామ్యులమవుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు, సీపీఐ నేత కూడా రాధాకృష్ణ, తెలుగు యువత నేత బుద్ద జ్యోతికిరణ్‌ అన్నారు. అలాగే బంద్‌ను అందరి మద్దతుతో విజయవంతం చేసేందుకు కృషిచేయాలని తీర్మానించారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఆశల సంఘం జిల్లా కార్యదర్శి మంగమ్మ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:09:40+05:30 IST