తాగునీటి సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-07-03T04:50:59+05:30 IST

గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీపీ రాజేంద్ర నాథ్‌ రెడ్డి తెలిపారు. వీరబల్లి ఎంపీపీ సభాభవనంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు.

తాగునీటి సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

వీరబల్లి, జూలై 2: గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీపీ రాజేంద్ర నాథ్‌ రెడ్డి తెలిపారు. వీరబల్లి ఎంపీపీ సభాభవనంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పం చులు, అధికారుల సహకారం ఎంతో అవసరమన్నారు. సమావే శంలో సభ్యులు చెప్పిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని సమస్యలను తనకు తెలిపితే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.  రోళ్లమడుగు తాగునీటి పథకం పైపులైనుకు మరమ్మతు లు చేయకపోవడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని, సచివాలయం సమీపంలో కొందరు భూ ఆక్రమణ చేస్తున్నారని తాటిగుంటపల్లె సర్పంచ్‌ గోపీ నాధరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయా లని, గ్రామీణ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని సానిపాయి సర్పం చ్‌ నేతి ఆంజినేయులు, వంగిమళ్లకు వెళ్లే మార్గంలో గంగనేరు పై దెబ్బతిన్న కల్వర్టుకు తాత్కాలికక మరమ్మత్తులు కూడా చేయక పోవడంతో  మండలకేంద్రానికి 10 కిలో మీటర్ల దూరం చుట్టుకుని వెళ్లాల్సి వస్తోందని సర్పంచ్‌ సిద్దవటం నాగులమ్మ తెలిపారు. గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉండడంతో   రోళ్లమడుగు తాగునీటి పథకం నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆద ర్శ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యు లు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ తులసమ్మ, ఎంపీడీ వో వెంకటసుబ్బయ్య, ఏఈలు సుబ్బయ్య, కృష్నయ్య, ఏపీవో నాగరాజు, ఏపీయం నిరంజన్‌, ఎంఈవో గిరివరదయ్య, ఆయా శాఖల అధికారులు వారి సమాచరం సభ్యులకు వివరించారు. పలువురు సమస్యలు విన్నవించగా వాటికి పరిష్కారం చూపారు.

Updated Date - 2022-07-03T04:50:59+05:30 IST