నర్సరీలలో నిర్దేశించిన మొక్కలను పెంచాలి

ABN , First Publish Date - 2021-12-03T04:57:47+05:30 IST

హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో మొక్కల పెంపకం పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య అన్నారు.

నర్సరీలలో నిర్దేశించిన మొక్కలను పెంచాలి
మొక్కల పెంపకం కోసం మట్టితో నింపుతున్న బ్యాగులను పరిశీలిస్తున్న సీఈవో

జడ్పీ సీఈవో ఎల్లయ్య

జహీరాబాద్‌, డిసెంబరు 2 : హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో మొక్కల పెంపకం పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య అన్నారు. గురువారం మండలంలో పిచేర్యాగడి, సజ్ఞాపూర్‌, బడంపేట గ్రామాలను సందర్శించిన ఆయన నర్సరీలు, పల్లె ప్రకృతివనాలను పరిశీలించి మాట్లాడారు. రాబోయే హరితహారం కల్లా ప్రతి నర్సరీలో 20 వేల మొక్కలు పెంచాలన్నారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డి, పిచేర్యాగడి సర్పంచ్‌ రవికిరణ్‌, పంచాయతీ కార్యదర్శి కళావతి ఉన్నారు. 

Updated Date - 2021-12-03T04:57:47+05:30 IST