పదవి ఆమెది.. పెత్తనం ఆయనది

ABN , First Publish Date - 2021-07-25T06:11:51+05:30 IST

కడప కార్పొరేషనలో శనివారం గృహ నిర్మాణాలు, నూతన ఆస్తి పన్నుల విధానం, వివిధ అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స హాలులో సమీక్ష నిర్వహించారు.

పదవి ఆమెది.. పెత్తనం ఆయనది
కడప కార్పొరేషనలో మహిళా కార్పొరేటర్లకు బదులు వారి భర్తలు హాజరైన అధికారిక సమావేశం

కడప కార్పొరేషన అధికారిక సమావేశంలో భర్తల హవా

కడప (ఎర్రముక్కపల్లె), జూలై 24 : కడప కార్పొరేషనలో శనివారం గృహ నిర్మాణాలు, నూతన ఆస్తి పన్నుల విధానం, వివిధ అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స హాలులో సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి కార్పొరేటర్లు వారికి సంబంధించిన డివిజన్లలో సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించాల్సి ఉంది. అయితే భార్యల స్థానంలో భర్తలు హాజరయ్యారు. అది కూడా అధికారికంగా కూర్చుని చర్చించారు. కడప కార్పొరేషనలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఒకరు టీడీపీ. ఇటీవల 22వ డివిజన కార్పొరేటరు బోలా పద్మావతి మృతి చెందారు. ఇక 26 మందిలో డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌ బేగం మాత్రమే హాజరయ్యారు. టీడీపీ కార్పొరేటర్‌ కానీ, ఆమె భర్త కానీ హాజరు కాలేదు. మిగిలిన 24 మంది కార్పొరేటర్ల స్థానంలో వారి భర్తలు హాజరయ్యారు. భార్యల స్థానంలో భర్తలు అధికారిక సమీక్షకు హాజరు కావడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళా సాధికారత అంటే ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా సమక్షంలోనే మహిళా హక్కులు కాలరాయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-07-25T06:11:51+05:30 IST