బాలికకు నిశ్చితార్థం.. అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

బాలికకు నిశ్చితార్థం.. అడ్డుకున్న పోలీసులు

బాలికకు నిశ్చితార్థం.. అడ్డుకున్న పోలీసులు

యాచారం, జూలై 1: మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఓ బాలికకు నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేయగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. కుర్మిద్ద గ్రామానికి చెందిన బాలిక వివాహం చేసేందుకు నిశ్చితార్థం ఏర్పాట్లను శుక్రవారం ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, షీటీం బృందం గ్రామానికి చేరుకొని బాలిక కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST