సమాజంలో పోలీసు శాఖ కీలకమైనది

ABN , First Publish Date - 2021-10-26T05:41:54+05:30 IST

సమాజంలో పోలీసు శాఖ ఎంతో కీలకమైందని డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అరవింద్‌బాబు అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోగల ప్రశాంతి నిలయంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రా రంభించి రక్తదానం చేశారు.

సమాజంలో పోలీసు శాఖ కీలకమైనది
రక్తదానం చేస్తున్న పోలీసు సిబ్బంది

డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అరవింద్‌ బాబు

ఖిల్లా, అక్టోబరు 25: సమాజంలో పోలీసు శాఖ ఎంతో కీలకమైందని డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అరవింద్‌బాబు అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోగల ప్రశాంతి నిలయంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రా రంభించి రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి ని ర్వహణలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని, అలాంటి అమరజవాన్లను, వారు చేసిన సాహసాలను గుర్తుచేసుకోవడానికే ప్రతి ఏడు అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామ ని అన్నారు. ఇందులో అమరవీరుల కుటుంబాల సమస్యలను తెలుసుకు ని పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతీరోజు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. రక్తదాన శిబిరంలో అదనపు డీసీపీ(అడ్మిన్‌) ఉషావిశ్వనాథ్‌తిరునగరి, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమరాజ్‌, రిజర్వు ఇన్స్‌పెక్టర్‌ శేఖర్‌, వెంకటప్పలనాయుడు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు వె ల్ఫేల్‌ ఆసుపత్రి డాక్టర్‌ సరళ, జిల్లా ఆస్పత్రి బ్లడ్‌బ్యాంకు ఇన్‌చార్జి రాజ్‌రె డ్డి, సందీప్‌కుమార్‌, వేణు దేవాగౌడ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అన ంతరం  పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నగరంలోని నాలుగో టౌన్‌ ఆవరణలో ఆన్‌లైన్‌లో ఓపెన్‌హౌజ్‌ కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉపయోగించే వివిధ రకా ల ఆయుధాలు, పరికరాలు వాటి పనితీరుపై వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఏ.వెంకటేశ్వర్లు, నగర సీఐ సత్యనారయణ, ఎస్‌ఐ. సందీప్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:41:54+05:30 IST