విచ్ఛిన్నశక్తులను అణచివేసే బాధ్యత పోలీసులది

ABN , First Publish Date - 2021-10-28T05:20:35+05:30 IST

విచ్చిన్న శక్తులను అణచివేసే గురుతర బాధ్యత పోలీసులపై ఉందన్న విషయాన్ని మరిచిపోరాదని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

విచ్ఛిన్నశక్తులను అణచివేసే బాధ్యత పోలీసులది
సైకిల్‌ ర్యాలీలో ఎస్పీ వెంకటేశ్వర్లు


- ఎస్పీ రావిరాలవెంకటేశ్వర్లు

- అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా  సైకిల్‌ ర్యాలీ


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 27 : విచ్చిన్న శక్తులను అణచివేసే గురుతర బాధ్యత  పోలీసులపై ఉందన్న విషయాన్ని మరిచిపోరాదని ఎస్పీ ఆర్‌  వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు అమరువీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం గా బుధవారం పోలీసులు జిల్లాకేంద్రంలో సైకిల్‌ర్యాలీ నిర్వహించారు.  గడియా రం చౌరస్తాలో బుఽఽధవారం ఎస్పీ జెండా ఊపి సైకిల్‌ర్యాలీని ప్రారంభించారు. పోలీసులతోపాటు ఎస్పీ సైకిల్‌ తొక్కారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులను సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టు కుంటుందని అన్నారు. పోలీసుల స్మృతిలోనే అక్టోబరు21న దేశవ్యాప్తంగా పోలీస్‌ ఫ్లాగ్‌డేను జరుపుకున్నామన్నారు. అక్టోబరు 21నుంచి 31 వరకు నిర్వహించే పలు కార్యక్రమాలలో భాగంగా సైకిల్‌ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరుల స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా, నిష్ఠగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.  ఈ కార్యకమ్రంలో డీఎస్పీలు కిషన్‌, టి శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌గౌడ్‌, అశోక్‌, సురేశ్‌, శ్రీనివాసులు, అప్పల నాయుడు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:20:35+05:30 IST