షుగర్‌ ఫ్యాక్టరీ మూయించినందుకే కవిత ఓడిపోయారు

ABN , First Publish Date - 2022-05-23T06:13:21+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనం తరం ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ మూయించినందుకే నిజామాబాద్‌ ఎం పీ ఎన్నికల్లో కవిత ఓడిపోయారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

షుగర్‌ ఫ్యాక్టరీ మూయించినందుకే కవిత ఓడిపోయారు
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌ రెడ్డి

 ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, మే 22 :టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనం తరం ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ మూయించినందుకే నిజామాబాద్‌ ఎం పీ ఎన్నికల్లో కవిత ఓడిపోయారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం  జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్‌లో జీవన్‌రెడ్డి ‘ఏబీన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యాయని కవిత చేసి న వాఖ్యలపై ఎమ్మెల్సీ మండిపడ్డారు. అసలు ఫిక్సింది అయ్యిందే టీఆర్‌ ఎస్‌, బీజేపీ పార్టీలు అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి సిద్దాంతమే లే దన్నారు. కేసీఆర్‌ తనయ కవిత ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆమెకే తెలి యదన్నారు. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వి ఫలమయ్యారని మొదటగా విమర్శించింది తానేనని ఇది తెలియక కవిత అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా రాకపోవడానికి కేసీఆర్‌ అసమర్థతతే కారణమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేఖత వచ్చిందని రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటవుతాయన్నారు.


Updated Date - 2022-05-23T06:13:21+05:30 IST