వావ్! ఇతడి టాలెంటే వేరు... రిక్షాపై రూప్ గార్డెన్.. ఎంత బాగుందంటూ నెటిజన్ల ప్రశంసలు..

ABN , First Publish Date - 2022-04-08T15:52:00+05:30 IST

కొందరికి ఎంతో టాలెంట్ ఉన్నా.. అవకాశాలు లేక మరుగున పడిపోతుంటారు. మరికొందరు అన్నీ ఉన్నా అణచివేతకు గురవుతుంటారు. ఇంకొందరు మాత్రం తమ తెలివితేటలకు పదును పెట్టి..

వావ్! ఇతడి టాలెంటే వేరు... రిక్షాపై రూప్ గార్డెన్.. ఎంత బాగుందంటూ నెటిజన్ల ప్రశంసలు..

కొందరికి ఎంతో టాలెంట్ ఉన్నా.. అవకాశాలు లేక మరుగున పడిపోతుంటారు. మరికొందరు అన్నీ ఉన్నా అణచివేతకు గురవుతుంటారు. ఇంకొందరు మాత్రం తమ తెలివితేటలకు పదును పెట్టి.. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. అనుకున్నది సాధించి, అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఈ కోవ కిందికే వస్తాడు. ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా.. తన రిక్షాపై ఏకంగా రూప్ గార్డెన్‌నే ఏర్పాటు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యక్తి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు..


కేరళలో ఓ రిక్షావాలా తన ప్రతిభకు పదును పెట్టాడు. ఎండలు మండిపోతుండడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా.. తన రిక్షాపై గార్డెన్‌ను ఏర్పాటు చేశాడు. అలాగే రిక్షాకు రెండు వైపులా మొక్కలతో కూడిన కుండీలను ఏర్పాటు చేశాడు. దీంతో ఈ రిక్షా ప్రయాణికులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రయాణించేందుకు అంతా క్యూ కడుతున్నారు. ది ఇన్నోవేటివ్ మేక్ఓవర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ అనే విదేశీయుడికి.. రిక్షావాలా వినూత్న ఆలోచన తెగ నచ్చేసింది.

అతడి కాంటాక్ట్ లిస్ట్‌లో 150 మంది మహిళల పేర్లు.. నంబర్ సేకరించి రోజూ చాటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..


అతడి ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. భారతీయుల్లో సృజనాత్మకతకు కొదువే లేదని చెప్పకొచ్చాడు. ’’ఎండలో కూడా చల్లగా ఉండేందుకు.. ఈ భారతీయుడు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు.. నిజంగా చాలా బాగుంది! ” అని రాస్తూ.. ఫొటోను షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతా ఈ వ్యక్తిలా వినూత్నంగా ఆలోచించాలని సూచిస్తున్నారు.

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..





Updated Date - 2022-04-08T15:52:00+05:30 IST