Abn logo
Oct 27 2021 @ 00:37AM

ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించే వ్యక్తి ఈటల

హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌

- బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 26: ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించే ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్‌ అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. హుజూరాబాద్‌ ప్రజలు ఆత్మగౌరవంతో తీర్పును ఇచ్చి ఈటలను గెలిపిస్తారన్నారు. ఈ ఉప ఎన్నికలో కేసీఆర్‌ అహంకారాన్ని, ధన బలాన్ని ఓడిస్తారన్నారు. పేదల, రైతుల పక్షాన ప్రధాని నరేంద్రమోదీ పని చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి త్వరలో చరమగీతం పాడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, మండల పరిషత్‌లకు నిధులు ఇస్తుందన్నారు. కేసీఆర్‌ ముక్త్‌ తెలంగాణ హుజూరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.