పింఛన్‌ పెంపు ఇంకెప్పుడో

ABN , First Publish Date - 2020-10-01T08:20:19+05:30 IST

సామాజిక పింఛను పెంపు పాలకుల హామీలకే పరిమితమతోంది. గతేడాది జూలై మొదటివారంలో పింఛనుదారులకు ఏటా రూ.250

పింఛన్‌ పెంపు ఇంకెప్పుడో

 మూడు నెలలు గడుస్తున్నా పెరగని రూ.250 

వలంటీర్ల నుంచి సమాధానం నిల్‌ 


సామర్లకోట, సెప్టెంబరు 30: సామాజిక పింఛను పెంపు పాలకుల హామీలకే పరిమితమతోంది. గతేడాది జూలై మొదటివారంలో పింఛనుదారులకు ఏటా రూ.250 పెంచుతా మని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అప్పట్లో రూ.250 పెంచి పింఛను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటి వరకు పెంపుదల చేయనేలేదు. ఎప్పుడు పెంపుదల ఉం టుందో కూడా తెలియని పరిస్ధితి నెలకొంది. పెన్షన్‌దారులు మూడు నెలలుగా ఎదురుచూస్తూ ఈనెల అయినా పెంచు తారా అని వేయి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు.


తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.3వేలకు పెంచుతామని జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ ఏటా రూ.250 చొప్పున ఇస్తామని.. నాల్గవ సంవత్సరం వచ్చేసరికి రూ.3 వేలకు చేరుకుంటుందని చెప్పి మాట మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏటా పెంచుతామన్న పింఛను కూడా ఇప్పటిదాకా పెంచలేదు. పెంపుదలపై వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని లబ్ధిదారులను వారి నుంచి సమా ధానం ఉండడం లేదు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా రిలీఫ్‌ కింద దేశ వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్‌దారులకు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున మంజూరు చేసింది. ఒక్కో దఫా రూ.500 చొప్పున రెండు దఫాలు విడు దల చేసింది. ఈ మేరకు కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో జమ చేసింది. అయితే మన రాష్ట్రంలో ఈ పరి హారం కూడా పెన్షన్‌దారులకు అందించలేదని సమాచారం.


ఇక జిల్లాలో 6.43 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు 2,74,199, వితంతువులు 2,35,403, దివ్యాం గులు 68,261 మంది, చేనేత కార్మికులు 11,387, కల్లుగీత కార్మికులు 6896, అభయ హస్తం లబ్ధిదారులు 16, 047, మత్స్యకారులు 9698, ఒంటరి మహిళలు 15,022, ట్రాన్స్‌ జెండర్లు 177, కిడ్నీ వ్యాధిగ్రస్తులు 677, చర్మకారులు 1818, డప్పు కళాకారులు 1528, డీఎంహెచ్‌వో ద్వారా 2083 మంది ఉన్నారు.


పింఛను పెంచలేదు : లక్ష్మి, సామర్లకోట

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల పెన్షన్‌ను రూ.2,250కి పెంచారు. ఈ ఏడాది ఇంకా పింఛను పెంచలేదు. ఎప్పుడు పెంచుతారో తెలీడం లేదు.


అక్టోబరు నెలలో పెంపుదల లేదు

అక్టోబరు నెలకు పాత విధానంలోనే పింఛను సొమ్ము పం పిణీ చేస్తాం. పెంపుదలకు సంబంధించి ఉత్తర్వులు అంద లేదు. వచ్చిన వెంటనే పెంపుదలకు చర్యలు తీసుకుంటాం.

                         - రమణారెడ్డి, ఎంపీడీవో, సామర్లకోట



Updated Date - 2020-10-01T08:20:19+05:30 IST