రైతులను రోడ్డున పడేశారు

ABN , First Publish Date - 2020-06-07T07:19:02+05:30 IST

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆదివారం ఆందోళనలు కొనసాగించారు.

రైతులను రోడ్డున పడేశారు

గుంటూరు, తాడికొండ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆదివారం ఆందోళనలు కొనసాగించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని రైతుల నిరసనలు శనివారం 172వ రోజుకు చేరాయి.


లాక్‌డౌన్‌ నిబం ధనలను అనుసరిస్తూ 29 గ్రామాల్లో రైతులు, మహిళలు ఇంటింటా అమరావతి కొనసాగించారు. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడకలో రైతులు ఆందోళనలను కొనసాగించారు. 


కావేరిబాయి మాకు ఆదర్శం...

 మలి వయసులో ఒంటరిగా పోరాడి కొడుకు ప్రాణం కాపాడుకున్న డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి తమకు ఆదర్శమంటూ అమరావతి పోరాట దళిత జేఏసీ నేతలు అన్నారు. తమ ప్రాంత మహిళా రైతుల పోరాటంతో అమ రావతిని నిలుపుకుంటామంటూ కొవ్వొత్తులు వెలిగించి దళిత నేతలు, రైతులు ప్రదర్శనలు చేశారు. రాజధాని రైతులు కేసులకు భయపడేది లేదని సృష్టం చేశారు. ఏ రోజుకైనా విజయం రాజధాని రైతులదేనని తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-06-07T07:19:02+05:30 IST