మరొకటి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-10T09:07:55+05:30 IST

మైదుకూరు పట్టణంలో గురువారం ఓ మహిళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

మరొకటి పాజిటివ్‌

జిల్లాలో 29కి చేరిన కరోనా కేసులు


కడప, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మైదుకూరు పట్టణంలో గురువారం ఓ మహిళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో 29కి చేరాయి. ఇప్పటికే ఈమె కుమారుడు కరోనా పాజిటివ్‌ నిర్ధారణై కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ ఐసోలేషన్‌ ఉన్నారు. 111 స్వాబ్‌ శాంపిల్స్‌ రిజల్ట్స్‌ రాగా అందులో ఒకరికే పాజిటివ్‌ వచ్చిందని జిల్లాలో కరోనా కంట్రోల్‌లో ఉందని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు.


అదనంగా కూరగాయల దుకాణాలు

కరోనా కట్టడి కోసం ఇప్పటికే కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, మైదుకూరు, పులివెందుల, బద్వేలు తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ మైదానాల్లో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించేలా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఒక్కసారిగా ఎక్కువమంది వస్తుండడంతో గుంపులుగా చేరి కూరగాయలు కొంటున్నారు.


రద్దీని తగ్గించేందుకు కడపలో 2, రాయచోటిలో 4, బ ద్వేలులో 2 అదనంగా తాత్కాలిక కూరగాయల దుకాణాల ఏర్పాటు చేసేందుకు మున్సిపల్‌ అధికారుల నుంచి స్థలాలు గుర్తించమని విన్నవించినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ వివరించారు. 


ఇవి పాటించండి 

11 రోజులు హోం ఐసోలేషన్‌ పూర్తి చేసిన కొందరు బయట తిరుగుతున్నారు. ఆ విధంగా తిరగడం మంచిది కాదు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇల్లు దాటకూడదు.


విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారంతా 28 రోజులు ఖచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాలి.


కరోనా వైరస్‌ కట్టడిపై ఏమైనా సందేహాలుంటే కోవిడ్‌-19 కమాండ్‌ కంట్రోల్‌ నెంబర్‌ 08562-245259, 259179కు కాల్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.


టెలి కన్సల్టేషన్‌ కోసం 08562-244437, 244070 కు కాల్‌ చేసి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.


రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న వాళ్లు ఆ ప్రాంతాన్ని దాటి బయటికి రాకూడదు. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లకూడదు.


కరోనా వైరస్‌ స్వాబ్‌ శాంపిల్స్‌, రిజల్ట్స్‌

మొత్తం శాంపిల్స్‌ 1005

రిజల్ట్స్‌ వచ్చినవి 635

నెగటివ్‌ 606

పాజిటివ్‌ 29

రిజల్ట్స్‌ రావలసినవి 369

9న తీసిన శాంపిల్స్‌ 87

Updated Date - 2020-04-10T09:07:55+05:30 IST