అసలు సూత్రధారి అల్లోల!

ABN , First Publish Date - 2022-05-28T07:00:41+05:30 IST

నిర్మల్‌ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల పోస్టుల భర్తీలో అవినీతి వ్యవహారంలో మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఈ వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని శాసనమండలి కాంగ్రెస్‌ పక్ష నేత జీవన్‌ రెడ్డి ఽధ్వజమెత్తారు.

అసలు సూత్రధారి అల్లోల!
కలెక్టరేట్‌ ఎదుట దీక్షా శిబిరం ఏర్పాట్లను తొలగిస్తున్న పోలీసులు

పారిశుఽధ్య కార్మికుల నియామకాల్లో మంత్రి హస్తం  

మండిపడ్డ శాసన మండలి కాంగ్రెస్‌ పక్ష నేత జీవన్‌రెడ్డి               

మహేశ్వర్‌ రెడ్డి దీక్ష భగ్నం  

ఇంట్లోనే కొనసాగింపు 

రద్దు చేసే దాక ఆందోళన ఆగదని ప్రకటించిన ఏలేటి 

నిర్మల్‌, మే 27 ( ఆంధ్రజ్యోతి ) : నిర్మల్‌ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల పోస్టుల భర్తీలో అవినీతి వ్యవహారంలో మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఈ వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని శాసనమండలి కాంగ్రెస్‌ పక్ష నేత జీవన్‌ రెడ్డి ఽధ్వజమెత్తారు. పారిశుధ్య పోస్టులో అక్రమాలను నిరసిస్తూ జిల్లాకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమానికి ఆయన హాజరై.. మాట్లాడారు. గత మూడు నెలల నుంచి ఈ వ్యవహారం తనకు తెలియనట్లుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరించడం సరికాదన్నారు. బాఽధ్యత గల మంత్రిగా తన సొంత నియోజకవర్గంలో తన కనుసన్నల్లో నడిచే మున్సిపల్‌ చైర్మన్‌, పురపాల క సంఘ వ్యవహారాలు మంత్రికి ఎలా తెలియకుండా ఉంటా యని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పైగా ఇప్పుడే తెలిసినట్టుగా నియామక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి ఐకే రెడ్డి.. వెంటనే ఘటనకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో రాష్ట్రంలోనే ఇంత భారీ అవినీతి ఎక్కడా జరగలేదని ఆరోపించారు. స్వయంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గంలో పేద వర్గాలకు చెందాల్సిన ఉద్యోగాలను పెద్ద కుటుంబాలకు రూ. లక్షలకు అమ్ముకోవడం సిగ్గు చేటన్నా రు. నిర్మల్‌ అంటే పోరాటాల గడ్డ అని పేరు ఉండేద ని.. కానీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చేసిన నిర్వాకం తో ఇప్పుడది అవినీతి అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై అనేక కబ్జా ఆరోపణలు ఉన్నాయని, చెరువులు, కుంట లు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. మంత్రితో పాటు ఆయన అను చరులు, బంధుగణం, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు చేసిన చెరువులు, కుంటలు, భూముల ఆక్రమణల వల్లే గత వానకాలం లో నిర్మల్‌ మునిగిపోయిందని ఆరోపించా రు. నిర్మల్‌ పట్టణమే ఒక భారీ చెరువులా మారడానికి మంత్రి ఐకే రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో పని చేస్తున్న నేతల నిర్వాకమేనని జీవన్‌ రెడ్డి ఽధ్వజమెత్తారు. ఇవన్నీ చాలవనట్లుగా చివరకు మున్సిపాలిటీలో పారిశుధ్య పోస్టులను కూడా అమ్ముకుంటా రా!? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ ఆధ్వర్యంలో ఈ అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీని వెనక ఇంద్రకరణ్‌ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాల న్నారు. మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి రాజీనామా చేయకపోతే ఆయనను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అటవీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఇంద్రకరణ్‌ రెడ్డి తన సొంత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిమ గిరిజనులు పడుతున్న పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఉన్నారంటే.. ఆ పదవికి ఆయన అర్హుడే కాదని మండిపడ్డారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అవినీతిలో ప్రథమస్థాయిలో ఉందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయ ంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారంటే ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. 

ఏలేటీ దీక్ష భగ్నం.. ఇంటి వద్దనే దీక్ష.. 

రద్దు చేసే వరకు పోరాడుతా : ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి 

పారిశుధ్య కార్మికుల నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ నిరుద్యోగుల పక్షాన ఆందోళనకు శ్రీకారం చుట్టిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి శుక్రవా రం నిర్మల్‌ కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేపడతానని ప్రకటించారు. దీంతో భారీగా కాంగ్రెస్‌ నా యకులతో పాటు నిరుద్యోగులు తరలివస్తున్నారన్న సమాచారంతో ఇంటలిజెన్స్‌తో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. మహేశ్వర్‌ రెడ్డిని కలెక్టర్‌ కార్యాలయానికి రానివ్వకుండా గృహ నిర్భంధం చేశారు. ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, డీఎస్పీ జీవ న్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మహేశ్వర్‌రెడ్డిని హౌజ్‌ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే దీక్ష కొనసాగించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల ను, నాయకులను గ్రామాల నుంచి నిర్మల్‌కు రానివ్వకుండా సరిహద్దుల్లో పోలీసులు పికెటింగ్‌లు ఏర్పాటు చేసి అటు నుంచి అటే తిరిగి పంపారు. కలెక్టరేట్‌ సమీపంలో వేసిన టెంట్‌లు, కుర్చీలను పోలీసు లు దగ్గరుండి తొలగించారు. సమాచారం తెలుసుకున్న మహేశ్వర్‌ రె డ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తన నివాసంలోనే దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉన్న కార్యకర్తలు భారీగా ఏలేటీ నివాసానికి తరలివచ్చారు. అయితే తన దీక్ష ఇంతటిలో ఆగదని, నియమాక ప్రక్రియను పూర్తిగా రద్దు చేసేంత వరకు కొనసాగుతుందని ప్రకటించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిలను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-28T07:00:41+05:30 IST