సుపరిపాలనే ‘న్యాయసేవాధికార’ లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-07T05:13:33+05:30 IST

సామాన్యులకు సైతం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా న్యాయస్థానాల సముదాయంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రధాన న్యాయమూర్తి గోపి జెండా ఊపి ప్రారంభించారు.

సుపరిపాలనే ‘న్యాయసేవాధికార’ లక్ష్యం
ర్యాలీలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి
అరసవల్లి ఆగస్టు 6:
సామాన్యులకు సైతం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా న్యాయస్థానాల సముదాయంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రధాన న్యాయమూర్తి గోపి  జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాన్యులకు కూడా సుపరిపాలన అందించేందుకు  అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా సమన్యాయం అందించే విషయంలో న్యాయవ్యవస్థ సఫలీకృతం అవుతోందన్నారు. ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపి, న్యాయవ్యవస్థపై వారికి మరింత అవగాహన, నమ్మకం పెరిగేలా చేయడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి టి.వెంకటేశ్వర్లు, సెకెండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జి.చక్రపాణి, థర్డ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి శ్రీదేవి, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అనూరాధ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జి.ఫల్గుణరావు, సెక్రెటరీ ఎ.భువనేశ్వర్‌, పారా లీగల్‌ వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవ్యవస్థ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-07T05:13:33+05:30 IST