సరికొత్త రియల్‌ దందా

ABN , First Publish Date - 2021-04-19T05:56:33+05:30 IST

మండలం హైదరాబాద్‌ రాజధానికి అతి సమీప ంలో ఉండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారులు తమ అక్రమ దందాను పల్లెలకు విస్తరింపజేస్తున్నారు.

సరికొత్త రియల్‌ దందా
తిరుమలాపురం గ్రామంలో రియల్టర్లు ఏర్పాటు చేసిన వెంచర్‌

 వ్యవసాయ భూములు వెంచర్లుగా మార్పు
 పాట్లుగా విక్రయించి వ్యవసాయ భూమిగా రిజిస్ర్టేషన్‌
 చింతపల్లి మండలం  తిరుమలాపురంలో దందా

చింతపల్లి, ఏప్రిల్‌ 18 : మండలం హైదరాబాద్‌ రాజధానికి అతి సమీప ంలో ఉండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారులు తమ అక్రమ దందాను పల్లెలకు విస్తరింపజేస్తున్నారు. ప్రభు త్వం వెంచర్ల ఏర్పాటుకు డీటీసీపీ అనుమతులు తప్పనిసరి అనడంతో వ్యాపారులు గ్రామాల్లో నయాదందాకు తెరలేపారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చింతపల్లి మండల కేంద్రానికి సుమా రు 10కి.మీ దూరంలో తిరుమలాపురం గ్రామాన్ని ఎంచుకొని  తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వ్యవసా య భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి హద్దురాళ్లకు బదులు చెట్లను నాటి విక్రయిస్తున్నారు. విక్రయించిన భూమిని గజాలకు బదులు గుంటల లెక్కన విక్రయిస్తున్నారు. ఈ విషయమై ‘ఐడియా అదిరింది కాని అనుమతులు లేవు’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు వెంచర్లలో హద్దురాళ్లుగా బండరాళ్లను ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్ముకోవడం చూశాం కానీ  హద్దురాళ్లుగా మొక్కలు నాటి వ్యవసాయ భూమిగా చూపుతూ ప్లాట్లు విక్రయించడం కొత్త ఒరవడికి తెరదీశారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము ఎగగొట్టే ప్రయ త్నం చేస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో వెంచ ర్లు ఏర్పాటు చేస్తే పదిశాతం భూమిని గ్రామపంచాయతీ పేరిట రిజిస్ర్టేషన్‌ చేయడంతో పాటు 33ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాని ఇక్కడ అలాంటి నిబంధనలు పాటించట్లేదు. 500, 1000, 2000 గజాల్లో ప్లాట్లు ఏర్పాటు చేసి గుంటల లెక్క విక్రయిస్తూ సరికొత్త దందాకు పాల్పడుతున్నారు. ఏజెంట్లతో భూములు విక్రయిస్తున్నారు. ఈ విషయమై గ్రామపంచాయతీ అధికారులకు గాని, రెవెన్యూ అధికారులకు గాని ఎలాంటి సమాచారం లేకపోవడం కొసమెరుపు.
నోటీసులు జారీ చేశాం

- నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి
తిరుమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన వేంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవు. గతంలోనే రెండుసార్లు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. జిల్లా అధికారులకు సైతం సమాచారం ఇచ్చాం.

విచారించి  చర్యలు తీసుకుంటాం

- సీహెచ్‌.విశాలాక్ష్మి, తహసీల్దార్‌
తిరుమలపురం గ్రామంలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ వెంచర్లకు ఎలాంటి అనుమతులులేవు. విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-04-19T05:56:33+05:30 IST