Abn logo
Jun 23 2021 @ 23:09PM

గోడు మిగుల్చుతున్న గూడు

గతేడాది బుద్దారంలో మట్టిమిద్దె కూలి చనిపోయిన వారి మృతదేహాలు (ఫైల్‌)

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా మట్టి ఇళ్లల్లోనే ప్రజల నివాసం

- ఏటా వానాకాలంలో మిద్దెలు కూలిపోయి తరచూ ప్రాణ నష్టం

- గతేడాది బుద్దారంలో మిద్దె కూలి ఐదుగురి మృతి

- తాజాగా బండరావిపాకులలో నానమ్మ, మనువడి బలి

- శిథిలమైన ఇళ్లకు తాత్కాలిక మనమ్మతులు

- ఉమ్మడి జిల్లాలో గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న 2,793 ఇళ్లు

- నత్తనడకన సాగుతున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు


(వనపర్తి, ఆంధ్రజ్యోతి) : అర్ధశతాబ్దం కింద నిర్మించిన మట్టిమిద్దెలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి.. కొత్త ఇల్లు కట్టుకోలేక కొందరు, పూర్వీకుల ఇల్లు అనే ప్రేమతో ఇంకొందరు వాటిల్లోనే నివాసం ఉంటున్నారు.. ఆ మట్టి మిద్దెలే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.. అర్ధరాత్రి సమయంలో కూలిపోవడంతో మట్టి దిబ్బల్లోనే వారి బతుకులు తెల్లారిపోతున్నాయి.. ఏం జరిగిందోనని చుట్టు పక్కల వారు తేరుకునే లోపు వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.. ఏళ్లుగా నీడనిచ్చిన ఆ గూళ్లే వారి కుటుంబాలకు గోస మిగిల్చుతున్నాయి..

వందేళ్లకు పూర్వం ప్రజలు మట్టి ఇళ్లల్లో నివాసం ఉండేవారు. కాలక్రమేనా కాంక్రీట్‌, స్లా బ్‌తో ఇళ్లను నిర్మించుకొని, వాటిలోనే నివాసం ఉంటున్నారు. అయితే, ఆర్థిక స్తోమత లేని వా రు మాత్రం ఇప్పటికీ అవే మట్టి ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 50 ఏళ్ల నుంచి 80 ఏళ్ల కిందట నిర్మించిన మట్టి ఇళ్లల్లోనే ఇం కా ప్రజలు జీవిస్తున్నారు. వర్షాలకు దెబ్బతిని ఉరిసినా.. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చినా.. తాత్కాళిక మరమ్మతులు చేసుకోవడమో లేదా టార్ఫాలిన్‌ కవర్లు కప్పుకోవడమో చేస్తున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మూడు దశాబ్దాల కిందట కురిసిన వానలు క్రితం ఏడాది పడ్డాయి. నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో భారీగా ఇళ్లు కూలిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,023 ఇళ్లు దెబ్బతినగా, అందులో 145 పూర్తిగా కూలిపోయాయి. 878 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 1,277 ఇళ్లు దెబ్బతినగా, అందులో 51 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 1,226 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లాలో 243 ఇళ్లు కూలిపోయాయి. ఇందులో అ త్యంత ఎక్కువగా గోపాల్‌పేట ఉమ్మడి మండలంలో 63 ఇళ్లు కూలిపోయాయి. నాగర్‌కర్నూ లు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉన్నది. ప్రాణనష్టం కూ డా ఈ మూడు జిల్లాల్లో బాగా జరిగింది. విపత్తు నిర్వహణ కింద ప్రాణ నష్టం జరిగిన కు టుంబాలకు పరిహారం వచ్చే అవకాశం ఉండగా.. ఆస్తుల నష్టంపై స్పష్టత లేదు. గతంలో రా ష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పాడుపడి.. ఆ ఇంట్లో ఎవరూ నివా సముండకపోతే వాటిని తొలగించింది. కానీ, శిథిలమైన ఇళ్ల గుర్తింపును చేపట్టి.. వారికి ప్ర త్యామ్నాయ మార్గాలను చూపెట్టలేదు. సాధారణంగా ఏ ఇంటికైనా లైఫ్‌టైమ్‌ ఇంత అనేది ఉంటుంది. ఆ గడువు పూర్తయితే వాటిలో నివాసం ఉంటున్న వారు ఖాళీ చేసి.. కొత్త ఇంటిని నిర్మించుకోవాలి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు దీన్ని పట్టించుకోవడం లేదు. దానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణమే.. అయితే, అధికారులు లైఫ్‌టైమ్‌ పూర్తయిన ఇళ్లను గుర్తించి.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమో.. లేక వాటిని ఖాళీ చేయించి.. కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి సూచనలు చేయాలి. ఆర్థిక స్థోమత లేనివారికి ప్రభుత్వమే నూతన ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పథకం ఇంకా నత్తనడకనే సాగుతోంది. కొత్త ఇళ్ల నిర్మాణం అనేది ఇంకా గ్రామీణ ప్రాం తాల వారికి అందని ద్రాక్షగానే మిగులుతోంది. 


కలచి వేసిన దుర్ఘటనలు

రెండేళ్లుగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఘటనలు అందరినీ కలచి వేస్తున్నాయి. గ తేడాది గోపాల్‌పేట మండలం బుద్దారంలో తండ్రి సంవత్సరీకం కోసం వచ్చిన కుటుంబ స భ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా.. మట్టి మిద్దె కూలిపోవడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. దుర్ఘటన జరిగిన ఇల్లు సుమారు 80 ఏళ్ల కిందటిది. గ తేడాది కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. అంతకుముందే ఆ ఇల్లు దెబ్బతినగా.. ప్రమా దం జరిగిన గదిపైన పైకప్పు ఉరవకుండా టార్ఫాలిన్‌ కవర్‌ను కప్పారు. కానీ, ఇవేమి ఆ కు టుంబ సభ్యులను కాపాడలేదు. నాగర్‌కర్నూలు జిల్లాలో అదే ఏడాది ఇల్లు కూలడంతో ఇద్దరు మరణించారు. నారా యణపేట జిల్లాలో గత సంవత్సరం నర్వ మండలం కన్మనూరు గ్రామానికి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలితోపాటు ధన్వాడ మండలంలో మూడేళ్ల బాలుడు మట్టి మిద్దె కూలిపోయి మృతి చెందారు. తాజాగా వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల సర్పంచ్‌ లక్ష్మమ్మ, తన మనవడు యోగేష్‌ మట్టి ఇంట్లో నిద్రిస్తుండగా.. మిద్దెకూలి మంగళవారం అర్ధరాత్రి మర ణించారు. ఆ ఇల్లు గతంలో నుంచే పొటుకు పెడుతుండగా.. టార్ఫలిన్‌ కవర్‌ కప్పారు. వీరు నిద్రిస్తున్న సమయంలో మట్టి మిద్దె అమాంతం కూలడంతో ప్రాణాలు విడిచారు. ఈ వి షయం ఉదయం ఆరుగంటల వరకు ఎవరికీ తెలియలేదు. ముందుగా తెలిసి ఉంటే ప్రాణా లు దక్కేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఏటా మట్టి ఇళ్లు కూలిపోయి ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంది. కానీ, నష్టం జర గకుండా తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ కరువవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామీణ ప్రాం తాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను వేగం పెంచాల్సిన అవసరం ఉంది.