ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను తెరిపించాలి

ABN , First Publish Date - 2021-04-13T06:09:40+05:30 IST

వేలాది మంది చెరుకు రైతులు మందల మంది ఉద్యోగులు షేర్‌హోల్డర్‌లు కలిగిన సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని అఖిలభారత రైతుకూలీసంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్‌ చేశారు.

ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను తెరిపించాలి

నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 12: వేలాది మంది చెరుకు రైతులు మందల మంది ఉద్యోగులు షేర్‌హోల్డర్‌లు కలిగిన సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని అఖిలభారత రైతుకూలీసంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం చెరుకు రైతులు సమావేశం నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌కు ఎన్‌సీఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమావేశంలో పెద్ది వెంకట్రామయ్య మట్లాడుతూ... దేశంలోనే పేరు ప్రఖ్యాతలు కలిగిన సహకార చక్కెర కర్మాగారం లాభాల్లో నడుస్తుండేదని, అటువంటి ఫ్యాక్టరీని ప్రైవేట్‌ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు మూసివేయడం దారుణమన్నారు. ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను తిరిగి తెరిపించాలని చక్కెర రైతులు నెల రోజులకుపైగా 106 గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి చెరుకు పండించే ఆవశ్యకతను రైతులకు చెప్పారన్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే నడపాలని, లేనిపక్షంలో ఫ్యాక్టరీపై ఉన్న అప్పులు మాఫీచేసి రైతులకే అప్పగిస్తే రైతులు ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తారని అన్నారు. ఇందుకోసం అధికార, విపక్ష, వామపక్ష అన్ని వర్గాల వారు ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించి ఫ్యాక్టరీని తెరిపించేవరకు తమ వంతు సహాయం తప్పకుండా ఉంటుందని బరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ గతవైభవం, చక్కెర ఉత్పత్తి వంటి పలు అంశాలను రైతు నేతలు కొండల్‌ సాయిరెడ్డి, ఆకుల పాపయ్య వివరించారు. కార్యక్రమంలో  ఎన్‌సీఎస్‌ఎఫ్‌ పరిరక్షణ కమిటీ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, రైతు నేతలు, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T06:09:40+05:30 IST